సిరివెన్నెల చివ‌రి పాట అంటూ ప్రమోషన్లు..!

  • July 19, 2022 / 11:34 AM IST

దివంగత స్టార్ లిరిసిస్ట్ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు కొన్నాళ్ళుగా అనారోగ్యంతో బాధపడుతూ… గతేడాది నవంబర్ 30న మరణించిన సంగతి తెలిసిందే. సిరి వెన్నెల గారు మరణించిన కొద్దిరోజులకి…. నాని హీరోగా రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో ‘శ్యామ్ సింగ రాయ్’ చిత్రం రిలీజ్ అయ్యింది. ఇందులో ‘సిరి వెన్నెల’ అనే పాట ఉంటుంది. ఈ పాట సిరివెన్నెల గారు రచించిన ఆఖరి పాట అని ప్రచారం జరిగింది. దీంతో ఈ పాట చార్ట్ బస్టర్ అయ్యింది.

సినిమాకి కూడా బోలెడంత క్రేజ్ ఏర్పడింది. కొన్నాళ్ల తర్వాత ‘పక్కా కమర్షియల్’ సినిమా టైటిల్ సాంగ్ కూడా సిరివెన్నెల గారు రాసిన ఆఖరి పాట అంటూ ప్రచారం జరిగింది. అయితే కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రంగమార్తాండ’ , అలాగే హను రాఘవపూడి.. దుల్కర్ సల్మాన్ తో తెరకెక్కిస్తున్న ‘సీతా రామం’ సినిమాల్లో కూడా ఆయన పాటలు రాయడం జరిగింది. ఇదేంటి అనే డౌట్ అందరికీ రావచ్చు. కోవిడ్ వలన చాలా సినిమాల షూటింగ్ లు ఆగిపోయాయి.

అదే టైంలో సిరివెన్నెల గారు చాలా సినిమాలకు పాటలు రాశారు. షూటింగ్ లు డిలే అవ్వడం వలన ఆయన పాటలు రాసిన కొన్ని సినిమాలు ఇప్పుడు రిలీజ్ అవుతున్నాయి. కొంతమంది సిరివెన్నెల రాసిన ఆఖరి పాట మా చిత్రంలోనిదే అంటూ ప్రచారం చేసుకునే ప్రయత్నం చేశారు. కానీ క్లైమ్ ఇష్యుస్ రావడంతో ఆ ప్రయత్నాలు విరమించుకున్నారు అని తెలుస్తుంది.

నిజానికి సిరివెన్నెల గారు రాసిన ఆఖరి పాట ఏమిటి? అన్నది ఆయనకు తప్ప ఇంకెవరికీ తెలిసుండకపోవచ్చు. కానీ ఆయన చివరి పాట తన భార్య పై రాసినట్టు ఇన్సైడ్ సర్కిల్స్ నుండి వినిపిస్తున్న సమాచారం.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus