మొన్న ఊర్వశి రౌటెలా అన్నారు.. ఇప్పుడు అనుష్క శర్మ అంటున్నారు..!

  • September 12, 2020 / 06:31 PM IST

‘ఆది పురుష్’ సినిమాలో రాముడిగా ప్రభాస్ నటిస్తే .. సీతగా ఎవరు నటిస్తారు? గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ ఇదే..! ప్రభాస్ ను ఢీకొట్టే విలన్ లంకేష్ పాత్రలో కరీనా కపూర్ భర్త మరియు బాలీవుడ్ స్టార్ హీరో అయిన సైఫ్ అలీఖాన్ నటించబోతున్నట్టు చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. అయితే సీత పాత్రలో ఎవరు కనిపించేది వారు ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. మొదట కీర్తి సురేష్ పేరు వినిపించింది.

ఆ తరువాత కియారా అద్వానీ అన్నారు. వీళ్ళెవ్వరూ కాదు.. ఊర్వశి రౌటెలా వంటి బోల్డ్ బ్యూటీ సీతగా కనిపించబోతుంది అంటూ కూడా వార్తలు వచ్చాయి. ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. అయితే ప్రస్తుతం ఈమె ప్రెగ్నెంట్. 2021 జనవరిలో డెలివరీ అవుతుంది అని కోహ్లీ ఇటీవల ఓ సందర్భంలో క్లారిటీ ఇచ్చాడు. అందుకే ఇటీవల ‘ఆది పురుష్’ దర్శకుడు ఓం రౌత్ కూడా అనుష్క శర్మను కలిసి ఆమె పాత్ర గురించి చెప్పగానే సానుకూలంగా స్పందించిందట.

ఆమె కనుక ఈ పాత్ర చెయ్యడానికి ఒప్పుకుంటే అందరూ హ్యాపీనే..! నటన పరంగా కూడా అనుష్క శర్మ మెప్పిస్తుందనే నమ్మకం చాలా మందిలో ఉంది. అయితే అనుష్క శర్మ.. సీత పాత్రలో కనిపిస్తుందా లేదా..? ఒకవేళ ఆమె ఈ పాత్రలో నటించకపోతే.. సీత పాత్రలో ఎవరు నటిస్తారు? అనే కన్ఫ్యూజన్ కు.. ‘ఆది పురుష్’ దర్శకనిర్మాతలు ఎప్పుడు క్లారిటీ ఇస్తారో మరి..!

Most Recommended Video

బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
బిగ్‌బాస్‌ 4 హైలెట్స్: బిగ్‌బాస్‌ ఇలా రోజూ అయితే కష్టమే!
బిగ్‌బాస్‌ 4: ఇంట్లో వాళ్లు ఒకరు… బయటి నుంచి ముగ్గురట!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus