Ketika Sharma: ‘రొమాంటిక్’ హీరోయిన్ ఊసు లేదేంటి..!
November 16, 2021 / 11:12 PM IST
|Follow Us
టాలీవుడ్లో హీరోయిన్ తొలి అవకాశం సంపాదించడం ఎంత కష్టమో, సరైన హిట్ పడకపోతే రెండో అవకాశం సంపాదించడమూ అంత కంటే కష్టం. ఆ అమ్మాయి, ఐరెన్ లెగ్రా బాబూ అని పక్కనపెట్టేస్తుంటారు. అయితే కొంతమంది నాయికలు మాత్రం తొలి సినిమా రాకుండానే రెండో అవకాశం కొట్టేస్తుంటారు. అయితే ఆ తర్వాత మూడో సినిమా కు మళ్లీ మామూలే. ఇప్పుడు ఈ పరిస్థితి ఎదుర్కొంటున్న ముద్దుగుమ్మ కేతిక శర్మ. ‘రొమాంటిక్’తో చాలా రోజుల క్రితమే టాలీవుడ్లో అడుగుపెట్టింది కేతిక.
ఆ సినిమా విడుదల ఆలస్యం అవ్వడంతో ఆమెను తెరపై చూసే అవకాశం దొరకలేదు. అయితే నాగశౌర్య ‘లక్ష్య’లో ఛాన్స్‌కొట్టేసింది. ‘రొమాంటిక్’ బాక్సాఫీసు దగ్గర ఆశించిన విజయం దక్కించుకోలేదు. దీంతో ‘లక్ష్య’ మీద నమ్మకం పెట్టుకుంది. ఆ సినిమా ఎప్పుడొస్తుందనేది తెలియడం లేదు. దీంతో మూడో సినిమా లెక్క తేలడం లేదు.‘రొమాంటిక్’ సినిమా ఫలితం పక్కనపెడితే… కేతికకు మాత్రం మంచి గుర్తింపే దక్కింది. గ్లామర్‌గా కనిపించడం, స్కిన్ షో విషయంలో కేతిక ఎక్కడా తగ్గలేదు.
దీంతో టాలీవుడ్ కుర్ర హీరోల చూపు ఆమె మీద పడింది. కానీ ఏమైందో కానీ వరుసగా సినిమా అనౌన్స్మెంట్లు ఉంటాయనుకుంటే ఆ జాడ కనిపించడం లేదు. ‘ఉప్పెన’ తర్వాత కృతి శెట్టిలా ఉంటుంది అని చాలామంది అనుకున్న విషయం తెలిసిందే.