అందరి గురించి చెప్పి.. వెంకీ గురించి చెప్పడం లేదేం!

  • October 16, 2022 / 05:19 PM IST

ఎప్పుడో చిరంజీవి కుర్ర హీరోగా ఉన్నప్పుడు చేశాడు, మళ్లీ ఇప్పుడు చేస్తున్నాడు. దేని గురించి అనుకుంటున్నారా ఇదంతా. ఒకేసారి మల్టిపుల్‌ మూవీస్‌లో నటించడం గురించి. సెట్స్‌ మీద సినిమా ఉండగా.. మరో సినిమా కొబ్బరికాయ కూడా కొట్టడానికి ఇష్టపడని హీరోలు ఉన్న ఈ రోజుల్లో చిరంజీవి నాటి మ్యాజిక్‌ను రిపీట్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ సినిమా అనౌన్స్‌ చేశారు. అయితే ఇప్పుడు ఆ సినిమా మీద నీలి నీడలు కమ్ముకున్నాయి అంటున్నారు.

‘ఆచార్య’ సమయంలో డీవీవీ దానయ్య నిర్మాణంలో వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ సినిమా అనౌన్స్‌ చేశారు. ‘ఆచార్య’ ప్రచారంలో భాగంగా ఓసారి చిరంజీవి మాట్లాడుతూ ‘‘నా కథ పని మీద ఉన్నావ్‌.. ఆ పని బాగా చేయ్‌’ అని చెప్పారు కూడా. అయితే ఇప్పుడు వెంకీ కుడుముల ఆ సినిమాను పక్కనపెట్టేసి వేరే హీరోను వెతికే పనిలో ఉన్నారని టాలీవుడ్‌ టాక్‌. దీనికి కారణం వెంకీ చెప్పిన కథ.. చిరంజీవిని మెప్పించకపోవడమే అంటున్నారు.

సినిమా స్క్రిప్ట్‌ విషయంలో చిరంజీవి చాలా పక్కాగా ఉంటారని తెలిసిందే. గతంలో చాలా సినిమాలు ఇలా చివరి క్షణంలో ఆగిపోయినవే. ఇప్పుడు వెంకీ సినిమా కూడా అదే అంటూ పుకార్లు వినిపిస్తున్నాయి. దీనికి కారణం ఏంటా అని చూస్తే.. ఇటీవల వెంకీ కుడుముల.. తన రెండో హీరో నితిన్‌ను కలిశాడు అనే మాట. ‘ఛలో’ సినిమాతో ఇండస్ట్రీలోకి దర్శకుడిగా పరిచయమైనా.. వెంకీ చాలా రోజుల నుండి ఇండస్ట్రీలో ఉన్నారు. రామ్‌చరణ్‌ ‘తుఫాన్‌’కి రైటర్‌గా పని చేశారు.

అంతే కాదు.. చిరంజీవి ఫ్యాన్‌గా ఇండస్ట్రీలో వెంకీకి పేరు. అందుకే చిరంజీవితో సినిమాను అనౌన్స్‌ చేసినప్పుడు కూడా ‘స్టార్‌తో ఫ్యాన్‌ సినిమా’ అని హైలైట్‌ చేశారు. కానీ ఇప్పుడు చూస్తే ఆ సినిమా ముచ్చట్లు ఏవీ లేవు. ‘గాడ్‌ఫాదర్‌’ సినిమా రిలీజ్‌ తర్వాత చిరంజీవి ప్రెస్‌మీట్లు, ఇంటర్వ్యూల్లో ఈ సినిమా గురించి ఎక్కడా మాట్లాడకపోవడమూ ఈ సినిమా ఆగిపోయింది అనే పుకార్లకు మరో కారణం అని అంటున్నారు. మరి నిర్మాత దానయ్య నుండి ఏమైనా క్లారిటీ వస్తుందేమో చూడాలి.

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus