‘ఫ్యామిలీ మ్యాన్ 2’ సిరీస్ వచ్చాక… సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్న పదాల్లో ‘చెల్లమ్ సర్’ ఒకటి. ఫ్యామిలీ మ్యాన్ రెండో సీజన్లో ఈ పాత్ర నిడివి చాలా తక్కువ. కానీ బాగా రిజిస్టర్ అయిపోయింది. కొంతమందైతే ‘చెల్లమ్ సర్’ పాత్రను మానవ సెర్చింజన్ అంటూ గూగుల్‌తో పోలుస్తున్నారు. ఇంతగా ట్రెండ్ అవుతున్న, ఇంతమంది అభిమానుల్ని సంపాదించిన ఆ పాత్ర అవకాశం ఉదయ్ మహేశ్‌కు ఎలా వచ్చింది? ‘చెల్లమ్’ వెనుకున్న ఆ కథేంటంటే!
‘ఆఫీస్’ అనే తమిళ సీరియల్ ద్వారా ఉదయ్ మహేశ్ తమిళనాట అందరికీ తెలిశారు. అంతేకాదు ఈయన దర్శకుడు కూడా. ‘నాలై’, ‘చక్కర వియుగమ్’ అనే సినిమాలను తెరకెక్కించారు. నటుడిగా ‘ముదర్ కూడమ్’తో 2013లో తెరంగేట్రం చేశారు. ఇప్పటివరకు 30కి పైగా సినిమాల్లో నటించి మెప్పించారు. హీరోకి వచ్చే ఎలాంటి డౌట్నైనా క్లియర్ చేసే సూపర్ స్పై పాత్ర చెల్లమ్ సర్ది. ఉదయ్ మహేశ్ నిజానికి సీనియర్ ఆఫీసర్ దీపన్ పాత్ర కోసం ఆడిషన్ ఇచ్చారు.
కానీ ఆ పాత్రలో నటించేందుకు అళగమ్ పెరుమాళ్‌ను తీసుకున్నారు. దీంతో ఉదయ్ మహేశ్ కాస్త నిరాశ చెందాడు. ‘ఆడిషన్ అయిపోయిన కొన్ని నెలల తర్వాత చెల్లమ్ పాత్రలో నటించాలని ఉదయ్‌కి ఫోన్ వచ్చింది. షూటింగ్ లొకేషన్‌కు వెళ్లి కలిస్తే 30 నిమిషాల్లోనే నా పాత్ర ఎలా ఉండబోతుందో వివరించారట. చిత్రీకరణ సమయంలో దీనికి ఇంత పేరొస్తుందని ఊహించలేదట ఉదయ్ మహేశ్. తమిళంలో ‘చెల్లమ్’ అంటే డార్లింగ్ అని అర్థం. ప్రియమైన వారిని ప్రేమగా పిలుచుకునేటప్పుడు ఈ పదం వాడతారు.
ప్రకాశ్ రాజ్ ద్వారా ఈ పదం బాగా పాపులర్ అయ్యింది. ‘గిల్లీ’లో త్రిష తెరపై కనిపించినా ప్రతిసారి ముద్దుగా చెల్లమ్ అనే పిలుస్తాడు ప్రకాశ్‌రాజ్. ఆ పాత్రకు ఈ పేరే పెట్టడానికి ప్రేరణ ఏంటో తెలియదు కానీ… ఆ పాత్ర పూర్తి పేరు కాకపోవచ్చు అంటున్నారు. చెల్లమ్ సర్ గూఢచారి కాబట్టి తన వ్యక్తిగత వివరాలు గోప్యంగా ఉంచడానికి చెల్లమ్ అనే మారు పేరు పెట్టారేమో.
Most Recommended Video
ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!