Manchu Vishnu: విష్ణు అన్నాడా? లేదా? ఆ వీడియో సంగతేంటో?
October 17, 2022 / 10:34 AM IST
|Follow Us
‘‘ఇండస్ట్రీలో మంచు విష్ణు కుటుంబం మీద ఎవరికో కక్ష ఉందని, మా మీద కావాలనే ఓ నటుడు ట్రోలింగ్ చేయిస్తున్నాడు’’ అంటూ మంచు విష్ణు గత కొద్ది రోజులుగా చెబుతూ వస్తున్నారు. అయితే గత రెండు రోజులుగా మరోసారి ఈ విషయం చర్చలోకి వచ్చింది. దీనికి కారణం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) వన్ ఇయర్ ప్రెస్ మీట్. మంచు విష్ణు ‘మా’ అధ్యక్షుడు అయ్యి ఒక ఏడాది పూర్తయిన సందర్భంగా.. మొత్తం ప్యానల్ విత్ మోహన్‌బాబు మీడియాతో మాట్లాడి తమ ప్యానల్ చేసిన పనులు, చేయబోయే పనుల గురించి చెప్పారు.
ఇది జరిగి ఒక్క రోజు అయ్యిందో లేదో మంచు విష్ణు ‘క్లారిటీ’ అంటూ కొన్ని ట్వీట్లు చేశారు. అందులో భాగంగా తన మాటలు కాని వాటిని తన మాటలు చెప్పి కొంతమంది నెగిటివ్ పబ్లిసిటీ చేస్తున్నారు అంటూ రాసుకొచ్చారు. అందులో ఆయన చెప్పిన రెండు అంశాలు చూసుకుంటే.. ఒకటి ‘ఆదిపురుష్’ టీజర్ మీద విష్ణు స్పందన, రెండోది ‘మా’ సభ్యత్వం గురించి ఆయన చెప్పిన మాటలు. ఆ రెండు మాటలూ తాను అనలేదు అంటూ క్లారిటీ ఇచ్చాడు విష్ణు.
‘ఆదిపురుష్’ టీజర్ విషయంలో టీమ్ తనను కూడా మోసం చేసిందని, సినిమా మోషన్ క్యాప్చర్ విధానంలో చిత్రీకరిస్తున్నామని ముందే చెప్పలేదు అని విష్ణు అన్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలొచ్చాయి. ఇంగ్లిష్ వెబ్సైట్లు రాయడంతో, తెలుగు వాళ్లు అది నిజం అనుకుని రాసేశారు. దాన్ని చూసి కొందరు సోషల్ మీడియాలో పోస్ట్‌లు చేశారు. అయితే విష్ణు ఇక్కడి సోషల్ మీడియా పోస్టును పట్టుకుని ఇది ఫేక్ అని అన్నారు. అయితే నిజంగా ఆ ఇంగ్లిష్ మీడియాకు విష్ణు ఈ మాట అనలేదు అనుకుంటే.. వాటినే ఖండించొచ్చుగా?
రెండో విషయం మా సభ్యత్వం గురించి.. ‘రెండు సినిమాల్లో నటిస్తేనే మా లైఫ్ మెంబర్షిప్ ఇస్తాం’ అని విష్ణు చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో ఫుటేజ్ కూడా సోషల్ మీడియాలో ఉంది. అయితే ‘మా మెంబర్షిప్ కోసం నేనలా అనలేదు’ అంటూ శనివారం ట్వీట్ చేశాడు. దీంతో చాలా మంది ‘లైఫ్ మెంబర్షిప్’ గురించి వీడియోను ఆ ట్వీట్ కింద పెడుతున్నారు. ఇది నిజమా కాదా అని అడుగుతున్నారు. అయితే లైఫ్‌మెంబర్‌షిప్, మెంబర్షిప్ అనే విషయంలో తేడా ఉంది అనే వాదనా వినిపిస్తుంది. విష్ణు ఈ విషయమ్మీద కూడా క్లారిటీ ఇస్తే బాగుంటుంది. మెంబర్షిప్, లైఫ్ మెంబర్షిప్ అనేవి రెండు రకాలు ఉన్నాయా ‘మా’లో ఉన్నాయా? అనేది చెప్పాలి.