Bigg Boss 5 Telugu: సీజన్ 5 నుంచీ 5వవారం బయటకి వచ్చేది అతడేనా.?
October 9, 2021 / 12:13 PM IST
|Follow Us
బిగ్ బాస్ హౌస్ లో ఐదోవారం హౌస్ నుంచి ఏ కంటెస్టెంట్ బయటకి వస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే, ఈసారి నామినేషన్స్ లో ఏకంగా తొమ్మిదిమంది ఉన్నారు. ఇందులో లోబో, విశ్వ, ప్రియ, హమీదా, జెస్సీ, రవి, మానస్, సన్నీ ఇంకా షణ్ముక్ లు ఉన్నారు. ఇందులో అన్ అఫీషియల్ పోలింగ్ సైట్స్ అన్నింటిలోనూ షణ్ముక్ జస్వంత్ టాప్ ప్లేస్ లో ఉన్నాడు. అంతేకాదు, షణ్ముక్ కి ఇలాగే ఓటింగ్ జరిగితే మాత్రం విన్నర్ కూడా అయ్యేలా కనిపిస్తున్నాడు. ఈవిషయం పక్కనబెడితే, అసలు ఈవారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఆసక్తికరంగా మారింది.
షణ్ముక్ తర్వాత సన్నీ, రవి, మానస్, జెస్సీ, ప్రియలు సేఫ్ జోన్ లోనే ఉన్నారు. ఏ సైట్ లో చూసినా ముగ్గురు డేంజర్ జోన్ లో ఉన్నారు. వారిలో లోబో, విశ్వ , హమీదాలు ఉన్నారు. ఇక్కడే హమిదాని ఇప్పుడప్పుడే ఎలిమినేట్ చేసే సాహసం చేయదు బిగ్ బాస్ టీమ్ ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ లో ఇప్పుడిప్పుడే శ్రీరామ్ కి హమీదాకి లవ్ స్టోరీ అనేది స్టార్ట్ అయ్యింది. కాబట్టి ఇది ఇంకొన్నివారాలు రేటింగ్ కోసం నడిపించే అవకాశం ఉంటుంది. ఇక విశ్వ లేదా లోబోల్లోనే ఎలిమినేషన్ అనేది జరుగుతుంది.
విశ్వ టాస్క్ లలో మంచి పెర్పామన్స్ ఇస్తున్నాడు కాబట్టి విశ్వని కూడా సేఫ్ చేస్తారనే అంటున్నారు. దీన్ని బట్టీ చూస్తే ఈసారి లోబోని ఎలిమినేట్ చేయబోతున్నారా అనేది ఇంట్రస్టింగ్. లోబో ఆరో కంటెస్టెంట్ గా బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చాడు. లాస్ట్ వీక్ చాలా డేంజర్ జోన్ నుంచీ బయటపడ్డాడు. నటరాజ్ మాస్టర్ ఇంకా లోబో ఇద్దరూ కూడా చాలాసేపు టెన్షన్ పడ్డారు. చివరకి నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ అయ్యారు. ఇప్పుడు లోబో ఇంకా విశ్వల మద్యలో ఎలిమినేషన్ జరగబోతోందా అనేది ఆసక్తిగా మారింది. అదీమేటర్.