ఎవ్వరూ ఊహించని విలన్ తో ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేయనున్న శౌర్య

  • January 29, 2020 / 03:50 PM IST

థ్రిల్లర్ సినిమాకు సర్ప్రైజ్ ఎలిమెంట్స్ చాలా ముఖ్యం. “గూడచారి” సినిమాలో జగపతిబాబు విలన్ అనే విషయం మార్నింగ్ షోస్ పడేవరకూ ఎవరికీ తెలియదు. సినిమా టీం కూడా ఆ విషయాన్ని ఎక్కడా లీక్ అవ్వనివ్వకుండా చాలా జాగ్రత్తపడ్డారు. ఆ సర్ప్రైజ్ ఎలిమెంట్ సినిమాకి ఎలా హెల్ప్ అయ్యింది అనేది ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ‘‘అశ్వథ్థామ” బృందం కూడా అదే ఫార్మాట్ ను ఫాలో అవుతున్నారు. సినిమా మరో రెండు రోజుల్లో విడుదలకు సిద్ధమవుతున్నా.. ఇప్పటివరకూ సినిమాలో విలన్ ఎవరు అనేది మాత్రం రివీల్ చేయలేదు.

సినిమాలో విలన్ ఎవరు అనేది చాలా కీలకమైన విషయం.. అందుకే ట్రైలర్ లో కూడా విలన్ ను చూపించలేదు. సినిమాలో విలన్ క్యారెక్టర్ ను చూసి ఆడియన్స్ షాక్ అవ్వడం ఖాయమని, ఆ పాత్ర పోషించిన నటుడు ఎవరు అనేది విడుదల వరకూ సస్పెన్సట. మరి ఆడియన్స్ ను అంతగా ఆశ్చర్యపరిచే ఆ విలన్ ఎవరు అనేది తెలియాలంటే జనవరి 31న సినిమాను థియేటర్లో చూడాల్సిందే.

డిస్కో రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus