తెలుగు పరిశ్రమకు 2017 సంక్రాంతి తీపి గుర్తులను మిగిల్చింది. పెద్ద పండుగకు విడుదలైన చిత్రాలు విజయం సాధించడంతో నిర్మాతలతో పాటు డిస్ట్రిబ్యూటర్లు ఆనందంగా ఉన్నారు. అయితే ఈ సంక్రాంతి మొనగాడు ఎవరు? అనే దానిపై చర్చ మొదలయింది. జనవరి 11న రిలీజ్ అయిన మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నంబర్ 150 మూవీ విశేషంగా ఆకట్టుకుంది. భారీ ఓపెనింగ్స్ రాబట్టుకుంది. డ్యాన్సులు, ఫైట్లతో చిరు అదరగొట్టారు. ఇక జనవరి 12 న రిలీజ్ అయిన నటసింహ నందమూరి బాలకృష్ణ వందో చిత్రం గౌతమి పుత్ర శాతకర్ణి అభినందనలు అందుకుంది. బాలకృష్ణ తనదైన శైలిలో డైలాగులు చెప్పి రోమాలు నిక్క పొడిచేలా చేశారు. యుద్ధ విన్యాసాలతో ఔరా వినిపించారు. బాలయ్య కెరీర్ లోనే అత్యంత వేగంగా వంద కోట్ల క్లబ్ లో చేరిన చిత్రంగా ఇది చరిత్ర సృష్టించింది. సంక్రాంతి రోజు వచ్చిన శర్వానంద్ శతమానం భవతి మూవీ ఫ్యామిలీ ఆడియన్స్ ను అలరించింది.
ఈ మూడు చిత్రాలు వేర్వేరు కథలతో రూపుదిద్దుకోవడంతో తమ వర్గ ఆడియన్స్ ని ఆకర్షించి విజయాన్ని సాధించాయి. ఇక సంక్రాంతి మొనగాడు ఎవరు అనే విషయానికి వస్తే ఈ సారి ఆ కిరీటాన్ని చిరు, బాలయ్యకి ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే పదేళ్లుగా థియేటర్లకు దూరంగా ఉన్నవారిని చిరు మళ్ళీ థియేటర్ కి రప్పించారు. సీరియల్స్ కి పరిమితమయిన మహిళలలను సైతం తల్లి సెంటిమెంట్ తో బాలయ్య థియేటర్స్ కి రప్పించారు. వీరిద్దరూ మంచి కథలను ఎంచుకోవడంతో పాటు, అద్భుతంగా నటించి ప్రశంసలు అందుకున్నారు. కాబట్టి 2017 సంక్రాంతి మొనగాళ్లుగా చిరంజీవి, బాలకృష్ణ నిలిచారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.