బిగ్ బాస్ హౌస్ లో ప్రతివారం ఎలిమినేషన్ అత్యంత నాటకీయంగా అవుతుంది. ఆదివారం హోస్ట్ నాగార్జున నామినేషన్స్ లో ఉన్నవారిని బాగా టెన్షన్ పెట్టేస్తాడు. లాస్ట్ వీక్ అంటే మొదటివారం బిగ్ బాస్ హౌస్ లోనుంచీ ఎలిమినేట్ అయ్యి వచ్చింది సరయు. ఆ తర్వాత మీడియా ఇంటర్య్వూస్ చేస్తూ తన గేమ్ ని ఎనలైజ్ చేసి చెప్పింది. అయితే, ఇప్పుడు సెకండ్ వీక్ ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అనేది చాలా ఉత్కంఠంగా మారింది.
రెండురోజుల పోలింగ్ తర్వాత ఇప్పుడు హౌస్ మేట్స్ ఆడే టాస్క్ లపైనే వారి ఎలిమినేషన్ అనేది ఆధారపడి ఉంటుంది. అందుకే నామినేషన్స్ లో ఉన్నవారు చాలా ఎగ్రెసివ్ గా గేమ్ ఆడేందుకు ట్రై చేస్తుంటారు. నామినేషన్స్ లో ఒకరకమైన టెన్షన్ ఉంటే, ఎలిమినేషన్ లో ఇంకో రకమైన టెన్షన్ ఉంటుంది. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ 2వ వారం నామినేషన్స్ లో ఏడుగురు ఉన్నారు. ఇందులో నలుగురు ఖచ్చితంగా సేవ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ప్రియ, ప్రియాంకసింగ్, లోబో, కాజల్ ఈ నలుగురు ప్రస్తుతానికి సేఫ్ జోనే లోనే ఉన్నారు.
ఇక మిగిలిన ఉమాదేవి, నటరాజ్ మాస్టర్, అనీమాస్టర్స్ డేంజర్ జోన్ లో ఉన్నారు. ప్రస్తుతానికి హౌస్ లో ఒకే ఒక పెద్ద టాస్క్ అనేది పడింది. అందులో ఇప్పుడు ఎవరు నిరూపించుకుంటే వాళ్లు ఖచ్చితంగా సేఫ్ జోన్ లోకి వచ్చేస్తారు. ఇక ఎలిమినేషన్ అంటూ జరిగితే వీరి ముగ్గురులోనే ఉంటుందని అంటున్నారు నెటిజన్స్. అదీ మేటర్.
Most Recommended Video
టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!