Anushka: ‘మిస్టర్‌.. మిసెస్‌’ పని మొత్తం మిస్టరే చూసుకోవాలా? ఎందుకిలా?

  • August 25, 2023 / 12:07 PM IST

సౌత్‌ సినిమాలో ప్రచారానికి డుమ్మా కొట్టే హీరోయిన్ల లిస్ట్‌ రాస్తే.. తొలి స్థానంలో నయనతార కనిపిస్తుంది. కానీ ఆమె అగ్రిమెంట్‌లోనే ‘నో ప్రమోషన్స్‌’ క్లాజ్‌ ఉంటుంది అని కూడా అంటారు. అయితే ఆమె సొంత నిర్మాణ సినిమాలకు వస్తుంది అనుకోండి. కానీ ఇప్పుడు ఇలాంటి క్లాజ్‌లు, సబ్‌ క్లాజ్‌లు ఏవీ లేకుండా ఓ కథానాయిక సినిమా ప్రచారాలకు రావడం లేదు. అందులోనూ ఆమె గతంలో సినిమా ప్రచారాలు అంటే ఠంచనుగా హాజరయ్యేది. ఇప్పుడు ఎందుకు రావడం లేదు అనేదే ప్రశ్నగా మారింది.

అనుష్క (Anushka) నటించిన తాజా చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. ఈ సినిమాలో యువ హీరో నవీన్ పోలిశెట్టి కథానాయకుడు. ఈ సినిమా వరుస వాయిదాల తర్వాత సెప్టెంబరు 7న విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతో చిత్రబృందం పెద్ద ఎత్తున ప్రచారం ప్రారంభించింది. అయితే ఈ మొత్తం పనులను నవీన్‌ ఒక్కడే చూసుకుంటున్నాడు. ఒక్కటంటే ఒక్క కార్యక్రమంలో కూడా అనుష్క కనిపించడం లేదు. దీంతో ‘అనుష్క ఎందుకు రావడం లేదు’ అనే ప్రశ్న వినిపిస్తూనే ఉంది.

35 – 40 ఏళ్ల అమ్మాయి, 30 ఏళ్ల కుర్రాడికి మధ్య ప్రేమ అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. పెళ్లి చేసుకోకుండా పిల్లలను కనేందుకు హెరాయిన్ స్పెర్మ్ డొనేషన్ అడిగే బోల్డ్ పాత్రలో అనుష్క నటించింది. దీంతో ఈ సినిమాలో ఆమె పాత్ర చాలా కీలకం. అలాంటి ఆమె ఈ సినిమా ప్రచారానికి రాకపోవడం సినిమా బిజినెస్‌కు బాగా చేటు చేసేదే. అలా అని గతంలోలాగా అనుష్క ఏమైనా లావుగా మారిపోయిందా.. అందుకే రావడం లేదా అంటే ట్రైలర్‌లో సన్నగా, గ్లామరస్‌గానే ఉంది.

అనుష్క మీడియా మందుకు, ప్రజల ముందుకు వచ్చి సుమారు మూడేళ్లు కావొస్తోంది. ‘నిశ‌బ్దం’ త‌ర‌వాత అనుష్క నుండి వస్తున్న సినిమా ఇదే. ఎందుకు ఏంటి అని ఆరా తీస్తే… ఈ మ‌ధ్య అనుష్క మళ్లీ బాగా బొద్దుగా త‌యారైందంటున్నారు. స్క్రీన్‌ మీద డీఐ, సీజీల‌తో కాస్త స్లిమ్‌గా చూపించే ప్రయత్నం చేశారు అంటున్నారు. ఇప్పుడు అదే లుక్‌లో బయటకు వస్తే సినిమా మీద ఎఫెక్ట్‌ పడుతుందేమో అని అనుకుంటున్నట్లు సమాచారం.

2023 టాప్- 10 గ్రాసర్స్.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే?

‘భోళా శంకర్’ తో పాటు కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 10 సినిమాల రిజల్ట్స్.!

‘వాల్తేరు..’ టు ‘జైలర్’.. ఈ ఏడాది ఫస్ట్ వీక్ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus