అంత ముఖ్య సమావేశానికి డుమ్మా కొట్టిన బాలయ్య, వెంకీ
May 21, 2020 / 04:26 PM IST
|Follow Us
నేడు చిత్ర పరిశ్రమ పెద్దలు ఓ కీలక మీటింగ్ లో పాల్గొన్నారు. పరిశ్రమ పెద్దలకు, ప్రభుత్వ ప్రతినిధులకు మధ్య జరిగిన ఈ మీటింగ్ కి మెగాస్టార్ చిరంజీవి నివాసం వేదిక అయ్యింది. నేడు ఉదయం తెలంగాణ గవర్నమెంట్ తరపున సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొనగా చిరంజీవి, నాగార్జన, నిర్మాతలు అల్లు అరవింద్,సురేష్ బాబు, సి.కళ్యాణ్,దిల్ రాజు, జెమిని కిరణ్, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, దర్శకులు రాజమౌళి, వి వి వినాయక్, త్రివిక్రమ్ శ్రీనివాస్, ఎన్. శంకర్, కొరటాల శివ లతో పాటు 30మందికి పైగా ఈ మీటింగ్ లో పాల్గొన్నారు.
చిత్ర పరిశ్రమలో ఏర్పడిన సంక్షోభం, కార్మికుల ఇబ్బందులు, థియేటర్స్ పునఃప్రారంభం, షూటింగ్స్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు వంటి అనేక విషయాలు చర్చించడం జరిగింది. ఈ విషయాల పట్ల మంత్రి తలసాని శ్రీనివాస్ స్పందించారు. అలాగే చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వ సహాయం ఎల్లవేళలా ఉంటుందని చెప్పడం జరిగింది. ఐతే చిత్ర పరిశ్రమ భవిష్యత్ ప్రశ్నార్ధకంగా తయారవుతున్న తరుణంలో పరిశ్రమ పెద్దలుగా ఉన్న చిరు, నాగ్ ఇలాంటి ఓ మీటింగ్ ఏర్పాటు చేసి, క్రైసిస్ నుండి బయటపడే మార్గం వెతుకుతుండగా బాలయ్య మాత్రం ఎందుకు స్థబ్దుగా ఉండిపోయారు.
ఇంత పెద్ద కీలక సమావేశానికి ఆయన రాలేదు. పరిశ్రమలో స్టార్ హీరోలుగా ఎప్పటి నుండో ఉన్న చిరు, నాగ్, బాలయ్య, వెంకటేష్ లలో బాలయ్య, వెంకటేష్ హాజరు కాలేదు. దగ్గుబాటి ఫ్యామిలీ నుండి సురేష్ బాబు హాజరుకాగా, నందమూరి ఫ్యామిలీ నుండి ఎవరు రాకపోవడం గమనార్హం. చిత్ర పరిశ్రమ ఆధారంగా ఎదిగిన వారు అది సంక్షోభంలో ఉన్నప్పుడు పట్టించుకోకపోవడం అంత హర్షించదగిన విషయం కాదు.