బిగ్‌బాస్ 4: ఎలిమినేషన్ ఉందని తూచ్ అంటున్నారెందుకు?
October 5, 2020 / 09:53 AM IST
|Follow Us
బిగ్‌బాస్‌లో డబుల్ ఎలిమినేషన్ ఉండటం అనేది పెద్ద విషయం కాదు. గత సీజన్లలో ఇలా డబుల్ ఎలిమినేషన్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే నాలుగో సీజన్‌కు వచ్చేసరికి పరిస్థితి మారింది. డబుల్ ఎలిమినేషన్ ఉంది అంటూ ఊరించి… ఆఖరులో ‘తూచ్’ అనేస్తున్నారు. రెండో వారంలో డబుల్ ఎలిమినేషన్ అని ఇటు ప్రేక్షకుల్ని, ఇంట్లో వాళ్లను నమ్మించి ఆఖరులో వెనక్కి తెచ్చేశారు. ఇప్పుడు నాలుగో వారంలోనూ అదే చేశారు. అయితే ఈసారి స్టయిల్ మార్చారు.
‘ఈ సారి డబుల్ ఎలిమినేషన్’ అంటూ నాగార్జున మరోసారి చెబితే జనాలు నమ్మే పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే ఈ నాలుగువారాల్లో రెండు సార్లు ఈ పేరు చెప్పి జనాలను మోసం చేశారు. రెండో వారంలో డబుల్ ఎలిమినేషన్ అని చెప్పి హారికను గేట్ వరకు పంపించి వెనక్కి తెచ్చేశారు. అయితే ఆ సారి భయపెట్టానికి అన్నారు ఓకే. మరి గత వారం ఏమైందో చూశాంగా జనాలకు అయితే ఇంకో ఎలిమినేషన్ ఉంటుందని చెప్పలేదు కానీ, ఇంట్లో వాళ్లకు మాత్రం అదే చెప్పారు. ఇన్‌డైరెక్ట్‌గా జనాలకు చెప్పినట్లే అనుకోండి.
ఆదివారం ఆఖరులో సభ్యులను నిలబెట్టి… 1 టు 6 ఎవరో నిర్ణయించుకోండి అని చెప్పారు. వాళ్లేమో తెగ చర్చలు జరిపేసి, తేల్చుకోలేకపోయారు. 1 టు 3 తేలిపోయినా… మిగిలిన మూడు ప్లేస్‌లు తేలలేదు. దీంతో ఇంట్లో సభ్యుల నుంచి ఆరియానా, అవినాష్ హెల్ప్ చేశారు. అంత జరిగాక ఈ నంబర్లు కరెక్ట్ కాదు.. జనాలు మీకు వేరే నెంబర్లు ఇచ్చారు. మిమ్మల్ని సేవ్ చేశారు అంటూ నాగార్జున తుస్ మనిపించాడు. వాళ్లు సేఫ్ అని చెప్పడానికి ఇంత ల్యాగ్ అవసరమా అనిపించేలా చేశాడు.
బిగ్‌బాస్ ఇంట్లో జరిగేవాటిని ఎవరూ ముందు ఊహించకూడదు అనుకోవడం మంచిదే. దానికి తగ్గట్టుగా వివరాలు లీక్ కాకుండా చూసుకోవాలి కానీ.. ఇలా జనాలను మోసం చేయొచ్చా. ఏదో ఉంది, ఇంకో ఎలిమినేషన్ ఉంది అంటూ జనాల్ని ఆశగా చూసేలా చేసి… ‘అవాక్కయ్యారా’ అనే రేంజీలో ఏం లేదు అని ఎలా చెబుతారు. అందరినీ జనాలు సేఫ్ చేశారు నాగ్ చెప్పాడు. అంటే అందరికీ సమానమైన ఓట్లు పడ్డాయా. అలా పడటం అసాధ్యం. బిగ్‌బాస్ బయటకు పంపాలంటే ఆ ఆరుగురిలో తక్కువ ఓట్లు వచ్చినవాళ్లను పంపేయొచ్చు. కానీ ఆ పని చేయలేదు. ఎందుకోమరి బిగ్‌బాస్‌కే తెలియాలి.