బిగ్‌బాస్ ఇంటి వస్తువులకు నష్టం చేయకూడదు, ఒకరి మీద ఒకరు అరుచుకోకూడదు, అరిచేలా చేయకూడదు. ఒకరిని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసి మనోభావాలు దెబ్బతినేలా చేయకూడదు బాగున్నాయి కదా ఈ నియమాలు. ప్రతి సంవత్సరం బిగ్‌బాస్ ఇంట్లో ఈ నియమాల గురించి ఏదో ఒక సందర్భంలో చెబుతూనే ఉంటారు. అయితే ఈ సీజన్లో ప్రియకు ఇవేవీ వర్తించవా? అంటే సీజన్లో ఆమె ప్రవర్తన చూస్తే… అదే అనిపిస్తోంది. ఆ మధ్య ఎప్పుడో ప్రియ మీద అరిచాడని లోబోను నాగార్జున మందలించారు.
ఆని అరించిందని ఆమెను నిలబెట్టి కడిగేశారు. మరి ఇదే పని చేస్తున్న ప్రియను ఎందుకు అడగరు. మంగళవారం, బుధవారం ఎపిసోడ్లు చూస్తే ఈ విషయం పక్కాగా తెలిసిపోతుంది. సన్నీని, అతనికి సపోర్టు చేసే వారిని టార్గెట్ చేస్తోంది ప్రియ. ఏమన్నా అంటే నా గేమ్ ఇంతే అంటోంది. అవతలి వ్యక్తిని మాటలు, చేష్టలతో ప్రొవోక్ చేస్తోంది. బుధవారం సంగతి చూసుకుంటే… మంగళవారంనాడు కేవలం సన్నీ బుట్టను టార్గెట్ చేసి దొంగిలిచింది. ఎందుకు అంటే నా గేమ్ అని పాత చింతకాయపచ్చడి డైలాగ్ వేసింది.
బుధవారం మరోసారి అదే ప్రయత్నం చేస్తే… సన్నీ అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ప్రియ తూలిపడబోయింది. ఈ క్రమంలో పక్కన ఉన్న ఫ్లవర్ వాజ్ తీసి కొట్టబోయింది. ఆ పని చేయలేదు కానీ… తిట్ల దండకం అందుకుంది. ‘చెంప పగలకొడతా..’ అంటూ సన్నీ మీద రెచ్చిపోయింది. సన్నీ తిరగబడే సరికి అదే మాట రిపీట్ చేసేస్తూ… కళ్ల వెంబడి నీళ్ల ట్యాంక్ ఓపెన్ చేసింది. ఫిజికల్‌గా హ్యాండిల్ చేశాడు అంటూ ఏడ్చేసింది.
మొదలుపెట్టింది ఎవరో జనాలకు తెలుసు. ఈ క్రమంలో సన్నీ ‘ఏయ్’ అన్నాడు. అలా ఎలా అంటాడు అంటూ… ప్రియ మరోసారి డ్రామా మొదలుపెట్టింది. ‘చెంప పగలకొడతా’ అనే మాట కంటే ఇది పెద్దదా అంటే లేదనే చెప్పాలి. ఇక బుట్టను కప్పడానికి సన్నీ ఓ కవర్ కట్టుకున్నాడు. దాన్ని చింపేసి బుట్టను ఎత్తి పడేసింది. ఇవి సామాన్లు డ్యామేజ్ కిందకు రావా. ఒకవేళ రావంటే… చిన్న పిల్లో కవర్‌కి ఎందుకంత గొడవ చేసినట్లు నాగార్జున గారూ. ప్రియ దగ్గరకు వచ్చేసరికి ఇలాంటివి కనిపించవేమో బిగ్‌బాస్.
Most Recommended Video
మహా సముద్రం సినిమా రివ్యూ & రేటింగ్!
ఒక్కో సినిమాకు ఈ స్టార్ హీరోలు ఎంతెంత డిమాండ్ చేస్తున్నారో తెలుసా?
టాలీవుడ్ లో బి.టెక్ చదువుకున్న 10 మంది లిస్ట్..!