బాహుబలికి పట్టిన గతే 2.0 కి కొనసాగింది.. కారణం ఏమిటో
September 10, 2019 / 05:44 PM IST
|Follow Us
హిందీ సినిమాలు “దంగల్, సీక్రెట్ సూపర్ స్టార్, మామ్” వంటివి చైనా మార్కెట్ లో కోట్లు కొల్లగొట్టడంతో.. తెలుగు సినిమాలను కూడా ఆదరిస్తారేమోనన్న నమ్మకంతో “బాహుబలి 1,2” చిత్రాలను అక్కడ విడుదల చేయగా.. పెద్దగా పట్టించుకోలేదు. ఇండియాస్ బిగ్గెస్ట్ హిట్ గా చెప్పుకొనే బాహుబలి సిరీస్ కి చైనాలో కనీస స్థాయి కలెక్షన్స్ కూడా రాలేదు. ఇప్పుడు రజనీకాంత్ తాజా చిత్రం “2.0”ది కూడా అదే పరిస్థితి. 4800 స్క్రీన్స్ లో విడుదలైన ఈ సినిమాకి ప్రారంభ వసూళ్లు పెద్దగా రాలేదు.. విడుదలై నాలుగు రోజులు పూర్తవుతున్నా కలెక్షన్స్ లో ఎలాంటి మార్పు లేదు. దాదాపు 600 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన “2.0” గ్రాఫిక్స్ కూడా చైనా ప్రేక్షకుల్ని అలరించలేకపోయాయి అంటే ఆలోచించాల్సిన విషయమే.
ఇదంతా చూసిన “జెర్సీ” మేకర్స్ తమ చిత్రాన్ని చైనాలో విడుదల చేయాలనే ఆలోచనను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. ఎందుకనో.. బాలీవుడ్ సినిమాలను ఆదరించినట్లుగా.. సౌత్ సినిమాలను చైనా ఆడియన్స్ పట్టించుకోవడం లేదు. ఇందుకు కారణం ఏమిటి అనే విషయం మీద విశ్లేషకులు చర్చించుకొంటున్నారు.