Chiranjeevi: ఆ ఫ్యాన్సీ నెంబర్ కోసం చిరు లక్షల్లో ఖర్చు చేస్తారట..!
August 27, 2023 / 01:14 PM IST
|Follow Us
మెగాస్టార్ చిరంజీవి పెద్దగా లగ్జరీల కోరుకునే వ్యక్తి కాదు. కానీ ఆయన ఇమేజ్ ను బట్టి.. కొంతవరకు హుందాగా ఉండాలని భావిస్తారు. అయితే చిరంజీవికి నంబర్ల సెంటిమెంట్ ఉంటుంది. ముఖ్యంగా తన కార్ల నంబర్ల విషయంలో చిరు ప్రత్యేక శ్రద్ధ పెడుతుంటారట. ఆయన గ్యారేజ్ లో స్పోర్ట్స్ కార్లు కూడా ఉన్నాయి. అవి చాలా ఖరీదైనవి. చిరంజీవి దగ్గర రోల్స్ రాయిస్ స్పెషల్ ఎడిషన్ కారు ఉంది. ఇది రాంచరణ్ – ఉపాసన లు చిరు కోసం ప్రత్యేకంగా బుక్ చేసి తెప్పించిన కారు.
దీని ధర అక్షరాలా రూ.8 కోట్లు.దీంతో పాటు మెర్సెడెస్ బెంజ్ జీ63 ఏఎంజీ కారు కూడా చిరు గ్యారేజ్ లో ఉంది. అలాగే ల్యాండ్ రోవర్ కి చెందిన రేంజ్ రోవర్ వోగ్ కార్ కూడా ఉంది. ఇది పక్కన పెడితే.. చిరంజీవి కార్లకి ఎక్కువగా 1111 నంబర్ ఉంటుంది. ఇది చిరు సెంటిమెంట్ నెంబర్. నెంబర్ 1 అంటే అతని ఇమేజ్ ను కూడా సూచిస్తుంటూ ఉంటుంది అని ఆయన నమ్ముతారట.
చిరు అన్ని విషయంలోనూ ముందుండాలని పరితపిస్తుంటారు. అందుకోసం ఎంతైనా ఖర్చు పెడతారు. అందుకే తన కార్లకి 1111 నంబర్ వచ్చేలా ప్రయత్నిస్తూ ఉంటారని సమాచారం. ఈ మధ్యనే టయోటా వెల్ఫైర్కు కూడా చిరంజీవి 1111 అనే నంబర్‌ను తీసుకున్నారు అని తెలుస్తుంది. ఆ నెంబర్ కోసం చిరు అక్షరాలా రూ.5 లక్షలు ఖర్చు చేసినట్లు సమాచారం.