త్రివిక్రమ్ సినిమాల్లోని హీరోలకి ఆకర్షణీయమైన పేర్లు
March 28, 2018 / 11:01 AM IST
|Follow Us
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి, అతని సినిమాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. తన పంచ్ లతో నవ్వులు పేల్చే త్రివిక్రమ్ టైటిల్ దగ్గర నుంచి ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు. అతని సినిమాల్లో హీరో విలన్ ని చంపడు.. ప్రతి సినిమాలోను జీవితానికి ఉపయోగపడే మాటలు ఉంటాయి. ఇవే మాత్రమే కాదు హీరో పేర్లు కూడా ప్రత్యేకంగా ఉంటాయి. ఎలాగంటే..
సంజయ్ సాహూ (జల్సా)పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కలయికలో వచ్చిన మొదటి చిత్రం జల్సా. ఇందులో పవన్ కి సంజయ్ సాహూ అని పేరు పెట్టి ప్రత్యేకత చాటుకున్నారు.
అల్లూరి సీతారామరాజు (ఖలేజా)మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరుకి ఓ పవర్ ఉంది. తెలుగు చిత్ర పరిశ్రమలో ఆ రోల్ పోషించి జేజేలు అందుకున్న నటుడు కృష్ణ. అందుకే అతని తనయుడు మహేష్ కి ఈ పేరు పెట్టారు.
రవీంద్ర నారాయణ్ (జులాయి)జులాయి గా తిరిగే అబ్బాయికి రవీంద్ర నారాయణ్ అనే పేరు ఊహించి ఉండరు. అందుకే జులాయి మూవీలో హీరోకి ఈ పేరు పెట్టారు.
గౌతమ్ నంద (అత్తారింటికి దారేది)పవన్, త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కిన రెండో చిత్రం అత్తారింటికి దారేదిలో హీరోకి గౌతమ్ నంద అని స్టైలిష్ పేరు పెట్టి సూపర్ హిట్ అందుకున్నారు.
విరాజ్ ఆనంద్ ( సన్నాఫ్ సత్య మూర్తి )తండ్రి విలువలని కాపాడే కొడుకుగా అల్లు అర్జున్ నటించిన సన్నాఫ్ సత్య మూర్తి అందరిని ఆకట్టుకుంది. అందులో బన్నీ పేరు విరాజ్ ఆనంద్ మరింత ఆకట్టుకుంది.
ఆనంద విహారి (అ..ఆ)అలనాటి కథ అయినప్పటికీ.. నేటి తరం వారికి నచ్చేలా అ..ఆ సినిమాని మలిచారు త్రివిక్రమ్. అంతేకాదు ఇందులో హీరో పేరుని కూడా ఆనంద విహారి అని పెట్టి హీరో క్యారెక్టర్ గురించి వివరించారు.
అభిషిక్త్ భార్గవ (అజ్ఞాతవాసి)పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ గత చిత్రాలైన జల్సా, అత్తారింటికి దారేది చిత్రాల్లో సంజయ్ సాహు, గౌతమ్ నంద అని అందమైన పేర్లు పెట్టారు. మూడో సినిమాలో అంతకు మించి మంచి పేరు పెట్టారు. “అజ్ఞాతవాసి” సినిమాలో పవన్ ని అభిషిక్త్ భార్గవ (ఏబీ) గా చూపించారు.
అర్జున్ పాల్వాయి / మైఖేల్ వేలాయుధం (తీన్ మార్)తీన్ మార్ సినిమాని త్రివిక్రమ్ డైరక్ట్ చేయలేదు. డైలాగ్ రైటర్ గా పనిచేశారు. అయినప్పటికీ హీరోలకి అర్జున్ పాల్వాయి / మైఖేల్ వేలాయుధం అని స్పెషల్ పేర్లు పెట్టి తన ప్రత్యేకతను చాటుకున్నారు.