Manchu Manoj: ‘అహం బ్రహ్మాస్మి’ ఆగిపోయినట్లే!

  • December 10, 2022 / 02:55 PM IST

మంచు మనోజ్ తన కెరీర్ లో కొన్ని హిట్టు సినిమాల్లో నటించారు. మొదట్లో తడబడినా.. ఆ తరువాత ‘నేను మీకు తెలుసా’, ‘ప్రయాణం’, ‘వేదం’, బిందాస్’ ఇలా చాలా సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు ఆయన నటించిన సినిమాలు కమర్షియల్ గా కూడా వర్కవుట్ అయ్యాయి. మంచు ఫ్యామిలీ నుంచి వచ్చిన నటుల్లో ప్రామిసింగ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు మంచు మనోజ్. రెగ్యులర్ గా కాకుండా డిఫరెంట్ కథలతో సినిమాలు తీస్తారనే ఇంప్రెషన్ క్రియేట్ చేయగలిగారు.

కానీ ఆ తరువాత వరుస ఫెయిల్యూర్స్ తో డీలా పడ్డారు. ఆయన నుంచి చివరిగా వచ్చిన సినిమా ‘ఒక్కడు మిగిలాడు’. 2017లో ఈ సినిమా విడుదలైంది. ఆ తరువాత మంచు మనోజ్ మరో సినిమా చేయలేదు. మూడేళ్లకు పైగా గ్యాప్ తీసుకొని ‘అహం బ్రహ్మాస్మి’ పేరుతో ఒక పాన్ ఇండియా సినిమాను అనౌన్స్ చేశారు. ప్రకటన అయితే వచ్చింది కానీ ఆ తరువాత సినిమాకి సంబంధించిన ఎలాంటి న్యూస్ బయటకు రాలేదు. సైలెంట్ గా షూటింగ్ జరుగుతుందేమో అనుకున్నారు.

కానీ అసలు ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లలేదని సమాచారం. రీసెంట్ గా మంచు మనోజ్ ట్విట్టర్ లో ఓ ఫొటోను షేర్ చేశారు. దానికొక క్యాప్షన్ ఇచ్చారు. అది చూసిన నెటిజన్లు మనోజ్ ని ‘అహం బ్రహ్మాస్మి’ సినిమా గురించి ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఓ నెటిజన్ ‘నీ బ్రహ్మాస్త్రం ఏమైంది అన్నా’ అని అడిగితే దానికి మనోజ్ ఒక స్మైలీ ఎమోజీని పెట్టి ఊరుకున్నారు.

మరో నెటిజన్ ‘అహం బ్రహ్మాస్మి’ పోస్టర్ పెట్టి.. ఈ ప్రాజెక్ట్ ఏమైందని అడిగితే మళ్లీ స్మైలీ ఎమోజీనే పెట్టి ఊరుకున్నారు తప్ప సినిమా గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. మనోజ్ రియాక్షన్ చూస్తుంటే ఆ సినిమాను ఆపేసి ఉంటారనే అనుమానాలు కలుగుతున్నాయి. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus