టాలీవుడ్లో అతికొద్ది కాలంలో అగ్ర నిర్మాణ సంస్థగా మారింది మైత్రీ మూవీ మేకర్స్. ముగ్గురు స్నేహితులు కలసి ఏర్పాటు చేసుకున్న ఆ నిర్మాణ సంస్థ చాలా వేగంగా ఎదిగిపోయింది. గతంలో స్టార్లతో ఉన్న పరిచయం వల్లనో, ఇంకే కారణాల వల్లనో కానీ.. వరుసగా స్టార్ల సినిమాలు చేస్తూ వచ్చారు. ఒకటి కాదు, రెండు కాదు వరుసగా అన్నీ అగ్ర కథానాయకులు, యువ స్టార్ హీరోలతోనే చేశారు. అయితే ఓ విషయంలో మాత్రం టీమ్ ఇంకాస్త జాగ్రత్త వహించాలని అర్థమవుతోంది. అదే చిన్న సినిమాలు.
మైత్రీ మూవీ మేకర్స్ నుండి వచ్చిన చిన్న సినిమాలు చూస్తే.. కిరణ్ అబ్బవరం ‘మీటర్’, లావణ్య త్రిపాఠి ‘హ్యాపీ బర్త్డే’, సుధీర్ బాబు ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. ఇవన్నీ గత ఏడాది కాలంలో మైత్రీ నుండి వచ్చి పరాజయం పాలైన సినిమాలే. దీంతో మైత్రీ మూవీ మేకర్స్ నుండి చిన్న సినిమా వస్తుంటే పెద్దగా నమ్మకం పెట్టుకోనక్కర్లేదు అనే అంటున్నారు అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. దీంతో సినిమా రంగంలో మొహమాటాలు ఉండొచ్చు కానీ..
మరీ బ్యానర్ పేరు ఇబ్బందిపడేలా ఉండకూడదు అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. పైన చెప్పిన సినిమాల సంగతి చూస్తే.. అందులో ఎక్కువ శాతం వేరే నిర్మాణ సంస్థల భాగస్వామ్యంతో రూపొందినవే అనే విషయం తెలిసిపోతుంది. ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమాకు తొలుత వేరే నిర్మాతలు ఉండేవారు. సినిమా విడుదలకు ముందు మైత్రీ వచ్చి చేరింది. ‘హ్యాపీ బర్త్డే’ సినిమా విషయంలోనూ ఇంచుమించు ఇంతే అంటారు.
మైత్రీ (Mythri Movie Makers) సీఈవో చెర్రీ సొంత నిర్మాణ సంస్థలో రూపొందిన ఈ సినిమాకు మైత్రీ బ్యానర్ యాడ్ అయ్యింది అని చెప్పొచ్చు. ఇక ‘మీటర్’ విషయంలో అయితే పప్పులో కాలేశారు అనే మాట వినిపిస్తోంది. ఇలా వరుసగా చిన్న సినిమాలు పోతే.. నిర్మాణ సంస్థకు కలసి రావడం లేదు అనే మాట వస్తోంది. దాంతోపాటు డబ్బులు కూడా తగ్గుతాయి. కాబట్టి మైత్రీ వాళ్ల లెక్కలు మరోసారి చూసుకుని కొత్త సినిమాల విషయంలో ఒకటికి, రెండుసార్లు చూసుకుని మంచి సినిమాలు ఇవ్వాలి అని అభిమానులు కోరుకుంటున్నారు.
రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!