‘క్వీన్’ రీమేక్స్ ఎందుకు విడుదల కావట్లేదు?

  • July 5, 2019 / 03:52 PM IST

2014 లో వచ్చిన ‘క్వీన్’ చిత్రం ఎటువంటి విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ చిత్రంలకంగనా నటనకి ప్రశంసల వర్షం కురిసింది. ఇక ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ,కన్నడ, మలయాళంలో రీమేక్ కాబోతున్న సంగతి తెలిసిందే. తెలుగులో తమన్నా, తమిళంలో కాజల్,కన్నడ లో పరుల్ యాదవ్, మలయాళంలో మంజిమ మోహన్ లు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఫస్ట్ లుక్స్ తో పాటు టీజర్లు కూడా విడుదల చేశారు. అయితే ఒక్క భాషలో కూడా ఈ రీమేక్ విడుదల కాలేదు.

దీనికి అసలు కారణం ఏంటనేది చిత్ర యూనిట్ మాత్రం వెల్లడించలేదు. అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ రీమేక్ లకి ఆశించిన స్థాయిలో బిజినెస్ జరగలేదని తెలుస్తుంది. కొంచెం ప్రమోషన్లు చేస్తే.. క్రేజ్ ఏర్పడి బిజినెస్ జరుగుతుందని భావించి ప్రమోషన్స్ మొదలు పెట్టారట. కానీ ఆ ప్లాన్ వర్కౌట్ కాలేదు. దీంతో నిర్మాతలు కూడా సైలెంట్ అయిపోయారని సమాచారం. హీరోయిన్లు కూడా మిగిలిన సినిమాల ప్రెస్ మీట్లలో ‘క్వీన్’ రీమేక్ గురించి ప్రశ్నలు అడిగినప్పటికీ.. దాని గురించి చెప్పకుండా జాగ్రత్త పడుతున్నారట. మరి ఈ సినిమాలు ఎప్పుడు రిలీజవుతాయో చూడాలి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus