MAA Elections: ఆ హీరోలకు ‘మా’ ఎన్నికలు అక్కర్లేదా?

  • October 6, 2021 / 10:02 PM IST

సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల ఎన్నికలు జరిగినప్పుడు టీవీల్లో, సోషల్‌ మీడియాల్లో కనిపించే కచ్చితమైన అంశం ‘తప్పక ఓటేయండి…’ అని చెప్పే వీడియోలు. సినిమా హీరోలు, హీరోయిన్లు చాలామంది ఇలా వీడియో బైట్లు ఇస్తుంటారు. ప్రభుత్వాలు కూడా ఇలాంటి వీడియోలు తీసి, ప్రచారం చేస్తుంటాయి. ప్రజలందరూ ముందుకొచ్చి ఓట్లు వేసి తమ నాయకుల్ని గెలిపించుకోవాలని. ఓటేసిన తర్వాత ‘మేం ఓటేశాం.. మరి మీరో’ అంటూ ఫొటోలతో సోషల్‌ మీడియాను నింపేస్తుంటారు. ఇప్పుడు ఈ లెక్కంతా ఎందుకు అని అంటే…

ఎన్నికల గురించి ఇన్ని మాటలు చెప్పే మన నాయకులు, నాయికలు తమ సంఘానికి జరిగే ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి ముఖం చాటేస్తున్నారు కాబట్టి. మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికలు అక్టోబరు 10న జరగబోతున్నాయి. అందులో లెక్క ప్రకారం అయితే సుమారు 900 ఓట్లు ఉన్నాయి. కానీ గత అనుభవాల దృష్ట్యా చూస్తే… సగం మందే ఓటేస్తారు అని చెప్పొచ్చు. ఇలా ఓటేసిన వాళ్లలో అందరూ చిన్న చిన్న ఆర్టిస్ట్‌లే.

పెద్ద ఆర్టిస్ట్‌లు, యువ హీరోలు, హీరోయిన్ల దగ్గరకు వచ్చేసరికి ‘ఓటు వేయాలనే’ ఆలోచనే కనిపించదు. మొన్నీ మధ్య జీవిత చెప్పిన వివరాల ప్రకారం ‘ఓటు వేయను’ అని ఎన్టీఆర్‌ అన్నారట. ఈ నేపథ్యంలో మిగిలిన హీరోల మనసు ఏంటి అనేది ఆలోచిస్తున్నారు పోటీదారులు. మరి వాళ్ల సంఘం నాయకుణ్ని ఎంచుకోవడానికే ముందుకురాని హీరోలు… అసలు ఎన్నికలకు వచ్చేసరికి ఎందుకంత ప్రచారం చేస్తున్నారో మరి.

రిపబ్లిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus