అక్కినేని నాగార్జున నటించిన కొత్త సినిమా ‘వైల్డ్ డాగ్’ నేరుగా నెట్ ఫ్లిక్స్ లో విడుదల కావాల్సింది. మూడు నెలల క్రితమే ఆ డీల్ పూర్తయింది. అప్పటికి కరోనా కేసులు బాగా ఉన్నాయి. థియేటర్లు అప్పుడే తెరుచుకున్నాయి. జనాలు థియేటర్లకు వస్తారో రారో అనే సందేహాలు ఉండేవి. దీంతో ఓటీటీ రిలీజ్ కరెక్ట్ అనుకున్నారు. కానీ కొన్ని రోజులకే సంక్రాంతి సినిమాలు రిలీజ్ అయ్యి బాగా ఆడాయి. దీంతో ‘వైల్డ్ డాగ్’ చిత్రబృందం నెట్ ఫ్లిక్స్ సంస్థతో మాట్లాడి డీల్ క్యాన్సిల్ చేసుకున్నారు.
ముందు సినిమాను థియేటర్లలో రిలీజ్ చేసి ఆ తరువాత కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చి నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఎక్స్క్లూజివ్ ఓటీటీ రిలీజ్ కు ఇస్తే రూ.20 కోట్ల వరకు ఇవ్వడానికి నెట్ ఫ్లిక్స్ వాళ్లు రెడీ అయ్యారు. కానీ థియేటరికల్ రిలీజ్ కు వెళ్లడంతో సగానికి సగం రేటు తగ్గించి డీల్ కి ఓకే చెప్పారు. ఫైనల్ గా ‘వైల్డ్ డాగ్’ సినిమాను బాగా ప్రమోట్ చేసి థియేటర్లో విడుదల చేశారు. సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చినా.. ప్రేక్షకులు ఈ సినిమా కోసం థియేటర్లకు రాలేదు. ఫుల్ రన్ లో ఈ సినిమా రూ.3 కోట్లు మాత్రమే సాధించింది.
అమ్మిన రేట్లలో సగం కూడా రికవర్ కాలేదు. ఊహించని విధంగా ఈ సినిమా డిజాస్టర్ అయింది. ఇక ఈ వారం ‘వకీల్ సాబ్’ సినిమా విడుదలవడంతో ‘వైల్డ్ డాగ్’ ఊసే లేకుండా పోయింది. దీంతో నిర్మాతలు తలలు పట్టుకున్నారు. ముందుగా అనుకున్నట్లు సినిమాను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేసి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని ఇప్పుడు ఫీల్ అవుతున్నారు మేకర్స్. థియేటర్లలో ఆడని ఈ సినిమాను నెట్ ఫ్లిక్స్ లో ఎంతవరకు ఆదరిస్తారో చూడాలి!
Most Recommended Video
వకీల్ సాబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!
జాతి రత్నాలు, ఉప్పెన, క్రాక్..ఇలా బాలీవుడ్ కు చాలానే వెళ్తున్నాయి..!