హీరోయిన్ సమంతకు షాకిచ్చిన డేట్ అఖిల్ కు హిట్ ఇస్తుందా?

  • April 23, 2023 / 08:28 PM IST

మరో నాలుగు రోజుల్లో అఖిల్ హీరోగా తెరకెక్కిన ఏజెంట్ మూవీ థియేటర్లలో విడుదల కానుంది. అదే తేదీన పొన్నియిన్ సెల్వన్2 సినిమా కూడా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో క్రేజ్ ఉన్న థియేటర్లలో ఏజెంట్ మూవీ విడుదలయ్యే విధంగా అఖిల్ ఫ్యాన్స్ కష్టపడుతున్నారు. రికార్డ్ స్థాయి థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ అవుతుండగా విరూపాక్ష సినిమాకు హిట్ టాక్ రావడంతో సెకండ్ వీక్ లో కూడా ఈ సినిమా భారీగా కలెక్షన్లను సాధించే ఛాన్స్ అయితే ఉంది.

అయితే ఏప్రిల్ 28వ తేదీన గతంలో పోకిరి, బాహుబలి2 సినిమాలు విడుదలై ఇండస్ట్రీ హిట్లుగా నిలిచాయి. ఏజెంట్ కూడా అదే సెంటిమెంట్ ను రిపీట్ చేస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఏజెంట్ మూవీ విషయంలో రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో తెలియాల్సి ఉంది. అయితే సమంత నటించిన కన్మణి రాంబో కతీజా సినిమా గతేడాది ఏప్రిల్ నెల 28వ తేదీన థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచిందనే సంగతి తెలిసిందే.

సమంతకు షాకిచ్చిన డేట్ అఖిల్ కు ఏ రేంజ్ హిట్ ఇస్తుందో చూడాల్సి ఉంది. అఖిల్ ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు. అఖిల్ రేంజ్ ను ఈ సినిమా పది రెట్లు పెంచుతుందని ఫ్యాన్స్ సైతం అనుకుంటున్నారు. భావిస్తున్నారు. ఏజెంట్ సినిమా కచ్చితంగా సక్సెస్ సాధిస్తుందని సురేందర్ రెడ్డి సైతం ఫీలవుతున్నారు. ఏజెంట్ సినిమా క్లాస్ యాక్షన్ కథాంశంతో తెరకెక్కడం గమనార్హం.

ఈ సినిమాలో స్పైగా అఖిల్ యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని తెలుస్తోంది. ఏజెంట్ మూవీ రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు సాధిస్తే ఈ తరహాలో మరిన్ని సినిమాలు వచ్చే ఛాన్స్ ఉంది. బుక్ మై షో వెబ్ సైట్ లో ఈ సినిమాపై ఆసక్తి చూపుతున్న వాళ్ల సంఖ్య పెరుగుతోంది. అఖిల్ వరుస విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus