Seetimaarr Song: ‘సీటిమార్’ రీమిక్స్ సాంగ్ తో బన్నీ ఇమేజ్ డబుల్ అయినట్టే..!

  • April 26, 2021 / 08:39 PM IST

ఈ మధ్యనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గా మారాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. పాన్ – ఇండియా లెవెల్లో రూపొందుతోన్న ఈ చిత్రం గురించి నార్త్ ప్రేక్షకులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ఇదిలా ఉండగా.. తాజాగా బాలీవుడ్ సూపర్ స్టార్లలో ఒకరైన సల్మాన్ ఖాన్ ఏకంగా ‘డిజె’ సినిమాలోని సీటీమార్ సాంగ్ ను తన ‘రాధే’ సినిమాలో రీమిక్స్ చేయించుకున్నాడు.

దాంతో ఈ టాపిక్ ఇండియా వైడ్ ట్రెండ్ అవుతుంది. ప్రభుదేవ ఈ చిత్రానికి దర్శకుడు. ఇక హరీష్ శంకర్ డైరెక్షన్లో తెరకెక్కిన ‘డిజె’ లోని ఈ పాట అప్పట్లో చార్ట్ బస్టర్ గా నిలిచింది. ఇక సినిమా విడుదలయ్యాక అల్లు అర్జున్ స్టెప్స్, పూజా గ్లామర్ ఈ పాట స్థాయిని మరింతగా పెంచాయనే చెప్పాలి. ‘అల్లు అర్జున్ ఈ పాటలో అదరగొట్టేశాడు’ అంటూ సల్మాన్ ఖాన్ ట్వీట్ కూడా వేసాడు.దీనికి బన్నీ కూడా థాంక్స్ చెబుతూ రిప్లై ఇచ్చాడు.

ఇది పక్కన పెడితే.. ‘రాధే’ లోని సీటిమార్ రీమిక్స్ సాంగ్లో సల్మాన్ ఖాన్ స్టెప్పులకు విమర్శలు గుప్పిస్తున్నారు నెటిజన్లు. పెద్ద ఎత్తున ట్రోలింగ్ కూడా జరుగుతుంది.’అల్లు అర్జున్ రేంజ్ పెరిగిందా? లేక సల్మాన్ ఖాన్ స్థాయి తగ్గిందా?’ అంటూ కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా బన్నీ మాత్రం నేషనల్ వైడ్ గా ట్రెండ్ అవ్వడానికి మంచి ఛాన్స్ కల్పించాడు సల్మాన్.


ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus