Chiranjeevi, Balakrishna: అన్నీ కలిసొస్తే రికార్డులు బద్దలవ్వాల్సిందేనా?
December 8, 2022 / 07:17 PM IST
|Follow Us
చిరంజీవి, బాలకృష్ణ యంగ్ జనరేషన్ స్టార్ హీరోలకు సైతం గట్టి పోటీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పరిమితంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు కూడా 120 కోట్ల రూపాయల లోపు బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి. చిరంజీవి, బాలయ్య సినిమాలు చాలా సందర్భాల్లో బాక్సాఫీస్ వద్ద పోటీ పడిన సంగతి తెలిసిందే. అయితే ఈ హీరోలు 2023 సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద మళ్లీ పోటీ పడుతున్నారు. ఈ సినిమాలతో చిరంజీవి, బాలకృష్ణ కెరీర్ హైయెస్ట్ కలెక్షన్లను సొంతం చేసుకుని రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
అయితే టాక్ పాజిటివ్ గా వస్తే మాత్రం రికార్డులు బద్ధలవుతాయని ఇందుకు సంబంధించి ఎలాంటి సందేహం అవసరం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ జనరేషన్ ఆడియన్స్ లో కూడా చిరంజీవి, బాలయ్యలకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. చిరంజీవి నటిస్తున్న వాల్తేరు వీరయ్య, బాలయ్య నటిస్తున్న వీరసింహారెడ్డి సినిమాలు ఒకే బ్యానర్ పై తెరకెక్కాయి. రెండు సినిమాలు భారీ బడ్జెట్ తో తెరకెక్కడంతో పాటు మాస్ ప్రేక్షకులే టార్గెట్ గా తెరకెక్కడం హాట్ టాపిక్ అవుతోంది.
చిరంజీవి, బాలయ్యలలో ఎవరి సినిమా పైచేయి సాధిస్తుందనే చర్చ కూడా సోషల్ మీడియా వేదికగా జరుగుతుండటం హాట్ టాపిక్ అవుతోంది. సంక్రాంతి సినిమాలలో ఏ సినిమాకు ఎక్కువ థియేటర్లు కేటాయిస్తారనే ప్రశ్నకు సైతం సమాధానం దొరకాల్సి ఉంది. సంక్రాంతి సినిమాలలో అన్ని సినిమాలపై మంచి అంచనాలు నెలకొనగా తునివు, వారసుడు సినిమాలు కూడా సంక్రాంతి కానుకగా థియేటర్లలో రిలీజ్ కానున్నాయి. తెలుగు, తమిళ సినిమాలు థియేటర్లలో పోటీ పడుతుండటంతో ఏ సినిమాకు అనుకూలంగా జరుగుతుందో చూడాల్సి ఉంది.