Jailer: సీనియర్ స్టార్ హీరోలకి .. అది సక్సెస్ సెంటిమెంట్ గా మారిపోతుందా?
August 3, 2023 / 08:04 PM IST
|Follow Us
ఈ మధ్య కాలంలో జనాలు థియేటర్లకు రావడం బాగా తగ్గించేశారు. ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా సరే .. సంథింగ్ స్పెషల్ ఉంటేనే టికెట్లు తెగుతున్నాయి. లేదంటే నాన్ – థియేట్రికల్ బిజినెస్ తోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది. కంటెంట్ బాగుంటే సీనియర్ స్టార్ హీరోల సినిమాలు కూడా రికార్డులు కొల్లగొడుతున్న సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం. ఇదిలా ఉండగా.. కొన్నాళ్లుగా సీనియర్ స్టార్ హీరోలకి ఓ సెంటిమెంట్ బాగా కలిసొస్తుంది అని చెప్పాలి.
అదేంటి అంటే.. సీనియర్ స్టార్ హీరోల సినిమాల్లో చిన్న పిల్లల సెంటిమెంట్ ఉంటే సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందట. గతేడాది కమల్ హాసన్ నటించిన ‘విక్రమ్’ సినిమా రిలీజ్ అయ్యింది. అందులో కమల్ హాసన్ తన మనవడి కోసం చేసే పోరాటాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అంతకు ముందు చూసుకుంటే ‘అఖండ’ సినిమాలో కూడా బాలకృష్ణ ఓ పాప కోసం ఫైట్ చేస్తూ ఉంటాడు. మరోపక్క ‘సర్దార్’ లో కార్తీ కూడా ఓ చిన్న పిల్లాడిని కాపాడుతూ అతని కోసం పోరాడుతూ ఉంటాడు.
అలాగే ‘బింబిసార’ లో కూడా కళ్యాణ్ రామ్ ఓ చిన్న పాపని కాపాడుతూ ఉంటాడు. ‘ఆర్.ఆర్.ఆర్’ లో ఎన్టీఆర్ కూడా ఓ పాప కోసం పోరాడుతూ ఉంటాడు. ఇప్పుడు ఇది సక్సెస్ ఫార్ములా అని నెటిజన్లు భావిస్తున్నారు. నిన్న ‘జైలర్’ సినిమా (Jailer) ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఇందులో రజినీకాంత్ కూడా ఓ బాబుని కాపాడుతూ ఉంటున్నట్టు విజువల్స్ ఉన్నాయి. దీంతో కొన్నాళ్లుగా సరైన సక్సెస్ లేక విలవిలలాడుతున్న రజినీకాంత్ కి ఓ పెద్ద సక్సెస్ పడటం గ్యారెంటీ అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.