Maama Mascheendra: ఇంట్రెస్టింగ్గా ఉన్నారు మామాఅల్లుళ్లు.. ఫలితం ఏమవుతుందో?
September 30, 2023 / 06:44 PM IST
|Follow Us
వారసత్వాల యందు సుధీర్‌బాబు వారసత్వం వేరయా అంటుంటారు. ఎందుకంటే వారసులుగా కొడుకులు, మేనల్లుళ్లు చూస్తుంటాం. వీటికి కాస్త డిఫరెంట్‌గా అల్లుడుగా వచ్చాడు సుధీర్‌బాబు. తొలినాళ్లలో వారసుడు అనే ముద్రతోనే ముందుకొచ్చిన సుధీర్‌బాబు ఆ తర్వాత తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను సొంతం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూ వస్తున్నాడు. విలన్‌గా కూడా కనిపించి మెప్పించాడు. అయితే ఇప్పుడు ప్రయోగాత్మక చిత్రంతో వస్తున్నాడు. సుధీర్‌బాబు గతంలో ఫక్తు కమర్షియల్ సినిమాలు చేశాడు.
మధ్యలో కొన్ని కామెడీ సినిమాలు కూడా చేశాడు. అయితే కొన్ని బాగా ఆడితే, కొన్ని నిరాశపరిచాయి. కొన్నాళ్ల క్రితం ‘మామా మశ్చీంద్ర’ పేరుతో ఓ సినిమా అనౌన్స్ చేశాడు. నటుడిగా, రచయిగా పేరుగాంచిన హర్షవర్ధన్ దర్శకత్వంలో సినిమా అనేసరికి సినిమాలో ఏదో కొత్తదనం ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేశారు. అనుకున్నట్లుగానే సినిమా నుండి వచ్చిన అప్డేట్స్ డిఫరెంట్‌గానే ఉన్నాయి. సినిమా కాన్సెప్ట్ కూడా డిఫరెంట్‌గా ఉందని తేలింది.
అయితే వరుస సగటు సినిమాల మధ్యలో ఈ సినిమా ఇరుక్కుపోతుందా, జనాలకు చేరకుండా పోతుందా అనే డౌటానుమానం వ్యక్తం చేస్తున్నారు సినిమా అభిమానులు. ‘మామా మశ్చీంద్ర’ సినిమాను అక్టబోరు 6న విడుదల చేస్తున్నారు. ఆ రోజు బాక్సాఫీసు దగ్గర చిన్న సినిమాలతో పెద్ద పోటీ ఉంది. కిరణ్ అబ్బవరం ‘రూల్స్ రంజన్’, కొత్త కుర్రాళ్ల ‘మ్యాడ్’, ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ ‘800’, కలర్స్ స్వాతి ‘మంత్ అఫ్ మధు’ తోపాటు మరికొన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.
దీంతో ఇన్ని సినిమాల మధ్య థియేటర్లు పంచుకుని మంచి కాన్సెప్ట్ సినిమా ఎటు వెళ్లిపోతుందా అనే డౌట్ క్రియేట్ అవుతోంది. మరి సుధీర్‌బాబు క్రేజ్‌తో సినిమా ఏమన్నా మ్యాజిక్ చేస్తుందా అనేది చూడాలి. మంచి కాన్సెప్ట్ మంచి కాన్సెప్ట్ అంటున్నారు కాన్సెప్ట్ చెప్పడం లేదు అనుకుంటున్నారా? వయసు మళ్లిన మేనమామ అచ్చంగా తన పోలికలతోనే ఉన్న ఇద్దరు మేనళ్లుళ్ల మీద ప్రతీకారానికి ప్రయత్నించడమే ఆ కాన్సెప్ట్. ఇందులో (Maama Mascheendra) మూడు డిఫరెంట్ పాత్రలను సుధీర్‌బాబు పోషించాడు.