చిరంజీవి రికార్డును బద్దలు కొట్టనున్న మహేష్ బాబు

  • February 18, 2017 / 10:08 AM IST

తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యధిక కలక్షన్స్  సాధించిన మూవీగా బాహుబలి ఉంది. ఆ చిత్రాన్ని పక్కన పెడితే ఖైదీ నంబర్ 150 మూవీ రానంతవరకు సూపర్ స్టార్ మహేష్ బాబు శ్రీమంతుడు సినిమా నంబర్ వన్ ప్లేస్ లో ఉన్నింది. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ ఫిల్మ్ 85 కోట్ల షేర్ వసూలు చేసి ప్రిన్స్ సత్తాని చాటింది. సంక్రాంతికి వచ్చిన మెగాస్టార్ చిరంజీవి మూవీ ఈ రికార్డును బద్దలు కొట్టింది. ఖైదీ నంబర్ 150 మూవీ 102 కోట్ల షేర్ తో బాహుబలి తర్వాతి స్థానాన్ని సొంతం చేసుకుంది. ఈ రికార్డును మహేష్ బీట్ చేస్తాడని అభిమానులు చెబుతున్నారు. ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో ప్రిన్స్ ద్విభాషా చిత్రాన్ని చేస్తున్నారు.

వంద కోట్లతో తెరకెక్కుతోన్న ఈ మూవీ చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. సంభవామి అనే టైటిల్ పరిశీలిస్తున్న ఈ ఫిల్మ్ మొదటి కాపీ రాక ముందే 150 కోట్ల ప్రీ బిజినెస్ చేసిందని మహేష్ ఫ్యాన్స్ చెబుతున్నారు. తెలుగు, తమిళంతో పాటు హిందీలోనూ రిలీజ్ కానున్న ఈ మూవీ 300 కోట్లు వసూలు చేస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాతో అవలీలగా చిరు రికార్డులను మహేష్ చిత్తు చేస్తాడని అంటున్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus