Nani: ఆ మూవీ సీక్వెల్ కు నాని ఓకే చెబుతారా?

  • February 21, 2023 / 08:43 PM IST

టాలీవుడ్ హీరోలలో ఒకరైన న్యాచురల్ స్టార్ నానికి ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే ఈ మధ్య కాలంలో నాని నటించిన సినిమాలేవీ ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదనే సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాతలలో ఒకరైన దిల్ రాజు నాని వేణు శ్రీరామ్ కాంబినేషన్ ను సెట్ చేసే దిశగా అడుగులు వేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తుండటం గమనార్హం. ఎంసీఏ సినిమాకు సీక్వెల్ తరహా కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది.

ఈ సినిమాకు తమ్ముడు అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారని సమాచారం అందుతోంది. అక్కా తమ్ముడి కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతుండగా భూమిక నానికి అక్క పాత్రలో కనిపించనున్నారని బోగట్టా. అయితే ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉందనే సంగతి తెలిసిందే. కొత్త డైరెక్టర్ల డైరెక్షన్ లో నటించడానికి నాని ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్న నేపథ్యంలో వేణు శ్రీరామ్ కు నాని ఓకే చెబుతారో లేదో చూడాల్సి ఉంది.

తమ్ముడు టైటిల్ తో తెరకెక్కే సినిమాలో నాని నటిస్తే మెగా ఫ్యాన్స్ నుంచి నెగిటివ్ కామెంట్లు వినిపించే ఛాన్స్ అయితే ఉంది. దిల్ రాజు నిర్మాతగా వరుసగా క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీ అవుతుండటం గమనార్హం. నాని దసరా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. దసరా సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేస్తుందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను మించి మెప్పించే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సినిమా తర్వాత నాని హిట్3 సినిమాలో నటించనున్నారు. నాని కెరీర్ ను ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారో చూడాల్సి ఉంది. నానిని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. బన్నీ ఛాన్స్ ఇవ్వని వేణు శ్రీరామ్ కు నాని ఛాన్స్ ఇస్తారేమో చూడాల్సి ఉంది.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus