తెలివిగా స్పందించిన సోనూ!

  • December 19, 2020 / 05:38 PM IST

లాక్ డౌన్ సమయంలో దేశవ్యాప్తంగా ఎందరికో సహాయం చేసి మానవత్వం చాటుకున్నాడు నటుడు సోనూసూద్. రాజకీయ విమర్శల జోలికి వెళ్లకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోయాడు. ఇదిలా ఉండగా.. రైతులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయన చట్టాలపై పంజాబ్‌ రైతులు దేశ రాజధాని ఢిల్లీలో ప్రతికూల వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటూ కొన్ని రోజుల నుండి ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సమస్యలపై స్పందించాడు సోనూసూద్. రైతుల దుస్థితి కలచి వేస్తుందంటూ ఓ కార్యక్రమంలో మాట్లాడారు.

ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేపట్టిన ఆందోళన దృశ్యాలను ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు. తప్పు ఎవరిది, ఒప్పు ఎవరిది అనే విషయంపై తాను మాట్లాడనని.. రైతుల సమస్యలను పరిష్కరించాలని మాత్రమే కోరుకుంటున్నట్లు తెలిపారు. తాను పంజాబ్ లోనే పుట్టి పెరిగాననే విషయాన్ని గుర్తు చేసుకున్న ఆయన.. రైతులతో తనకు చాలా అనుబంధం ఉందని.. ప్రేమతో చెబితే వారు వింటారని చెప్పుకొచ్చాడు. పొలాల్లో నాట్లు వేస్తూ ఉండాల్సిన రైతులు.. వారి కుటుంబంతో కలిసి రోడ్లపై చలికి వణుకుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

తన స్పీచ్ లో రైతుల గురించి మాత్రమే మాట్లాడిన సోనూ.. రైతులు వద్దంటున్న చట్టాల గురించి మాత్రం స్పందించలేదు. ఆ విషయం ఆయనకి తెలియక కాదు కానీ.. స్పందిస్తే లేనిపోని సమస్యలు వస్తాయనే అటు రైతులను నిప్పించకుండా.. ఇటు ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయకుండా తెలివిగా స్పందించాడు. సోనూ సేవా కార్యక్రమాలు మొదలుపెట్టిన కొత్తలో ఆయనను రాజకీయ నాయకులు టార్గెట్ చేశారు. అందుకే రాజకీయాలకు వీలైనంత దూరంగా ఉంటున్నాడు సోనూ.

Most Recommended Video

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus