Nithin: నితిన్ ఫ్యాన్స్ ను భయపెడుతున్న సెంటిమెంట్ ఇదే!

  • June 29, 2022 / 01:06 PM IST

ఈ మధ్య కాలంలో సరైన సక్సెస్ లేక కెరీర్ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న హీరోలలో నితిన్ ఒకరనే సంగతి తెలిసిందే. మాచర్ల నియోజకవర్గం సినిమాతో సక్సెస్ ట్రాక్ లోకి వస్తానని నితిన్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. నితిన్ కు జోడీగా కృతిశెట్టి ఈ సినిమాలో నటిస్తుండగా 30 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ ఏడాది ఆగష్టు 12వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుంది.

అయితే ఈ రిలీజ్ డేట్ నితిన్ అభిమానులను తెగ టెన్షన్ పెడుతోంది. ఆగష్టు నెలలో విడుదలైన నితిన్ సినిమాలలో ఎక్కువ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకుల అంచనాలను అందుకోలేదు. భారీ అంచనాలతో ఆగష్టులో విడుదలైన నితిన్ సినిమాలు నితిన్ కు భారీ షాకులిచ్చాయి. పొలిటికల్ థ్రిల్లర్ గా మాచర్ల నియోజకవర్గం సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమాలో మరో హీరోయిన్ గా కేథరిన్ థ్రెసా నటిస్తున్నారు. కొత్త దర్శకుడు ఎం.ఎస్.రాజశేఖర్ రెడ్డి డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది.

చెక్, రంగ్ దే, మ్యాస్ట్రో సినిమాలు ఒక సినిమాను మించి మరొకటి నితిన్ అభిమానులను నిరాశపరిచాయి. నితిన్ హీరోగా తెరకెక్కిన అడవి, లై, శ్రీనివాస కళ్యాణం ఆగష్టు నెలలో విడుదలై డిజాస్టర్లుగా నిలిచిన నేపథ్యంలో నితిన్ ఈ సెంటిమెంట్ ను బ్రేక్ చేయాల్సి ఉంది. మాస్ ప్రేక్షకులకు నచ్చేలా మాచర్ల నియోజకవర్గం సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నారు.

శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతుండగా ఈ బ్యానర్ నితిన్ సొంత బ్యానర్ అనే సంగతి తెలిసిందే. నితిన్ తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా సక్సెస్ లు సొంతం చేసుకుని రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. స్టార్ డైరెక్టర్ల డైరెక్షన్ లో నితిన్ నటించాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus