కర్ణాటకలో సినిమాలు బ్యాన్ అంటున్నారు… మన దగ్గరా అదే చేస్తారా?
March 25, 2024 / 12:17 PM IST
|Follow Us
సినిమా హీరోలు.. వాళ్ల కుటుంబ సభ్యులు రాజకీయాల్లోకి రావడం కొత్తేం కాదు. అలాగే వారి కోసం ఆయా హీరోలు, నటులు ప్రచారం చేయడం కూడా కొత్తేం కాదు. అయితే ఇప్పుడు కర్ణాటకలో బీజేపీ చేస్తున్న వాదనలు, కోరుతున్న చర్యలు చూస్తుంటే వచ్చే ఎన్నికల ప్రచారంలో సినిమా తారలు కనిపించరా? ఒకవేళ వాళ్లు కనిపిస్తే వాళ్ల సినిమాల మీద నిషేధం విధించేలా ఉన్నారు. దీనంతటికి కారణం కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్(Shiva Rajkumar) .
కన్నడ నాట స్టార్ హీరోగా వెలుగొందుతున్న ఆయన తెలుగు ప్రేక్షకులకు ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ (Gautamiputra Satakarni) సినిమాతో దగ్గరయ్యారు. రీసెంట్గా ‘జైలర్’ (Jailer) సినిమాతో మరోసారి వచ్చారు. ఇప్పుడు రామ్ చరణ్ (Ram Charan) – బుచ్చిబాబు (Buchi Babu) కలయికలో రూపొందబోతున్న ‘పెద్ది’ (Peddi) (రూమర్డ్ టైటిల్)లో కీలక పాత్ర చేస్తున్నారు. ఆ విషయాలు పక్కన పెడితే… కర్ణాటకలో శివరాజ్ కుమార్ సినిమాలు, పోస్టర్లు, పబ్లిసిటీ మెటీరియల్స్‌పై మీద నిషేధం విధించాలని రాష్ట్ర ఎన్నికల కమీషనర్‌కు బీజేపీ లేఖ రాయడం హాట్ టాపిక్‌గా మారింది.
శివమొగ్గ నియోజకవర్గంలో శివన్న భార్య గీత కాంగ్రెస్ తరఫున పోటీకి నిలుచున్నారు. దీంతో శివన్న పెద్ద ఎత్తున ప్రచారంలో పాల్గొంటున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన చిత్రాలు జనాల మీద ప్రభావం చూపిస్తాయని బీజేపీ వాదిస్తోంది. ఈ విషయంలో నిర్ణయం రావాల్సి ఉంది. దీంతో తెలుగు రాష్ట్రాలు, తమిళనాట, కేరళలో ఇదే తరహాలో ఫిర్యాదులు వస్తాయేమో అని అంటున్నారు. ఒకవేళ అదే జరిగితే తమిళనాట అధికార డీఎంకే, ఏపీలో టీడీపీ, జనసేనకు ఈ సమస్య వస్తుంది అంటున్నారు.
ఎందుకంటే పవన్ (Pawan Kalyan) ఫ్రంట్ ఫేస్ జనసేన, బాలకృష్ణ (Balakrishna) ఫ్రంట్ ఫేస్‌గా టీడీపీ తిరుగుతాయి. మరి ఇక్కడ కూడా అదే తరహాలో సినిమా వాళ్ల మీద నిషేధం అనే మాటొస్తే ఏంటా అనేది ప్రశ్న. మరి శివన్న విషయంలో ఎన్నికల సంఘం తీసుకుంటుందో చూడాలి. అప్పుడు మిగిలిన రాష్ట్రాల్లో ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందో చూడాలి.