ట్విట్టర్ లో నెటిజన్ క్వశ్చన్ కి రాజ్ తరుణ్ ఆన్సర్ అదిరింది!

  • December 11, 2018 / 12:32 PM IST

మన టాలీవుడ్ లో మాత్రమే కాదు ఏ ఇండస్ట్రీలో హీరో అయినా ఖాళీగా ఉన్నా అని ఒప్పుకోడు. కానీ.. యువ కథానాయకుడు రాజ్ తరుణ్ మాత్రం ఇందుకు మినహాయింపుగా నిలిచాడు. ఈమధ్యకాలంలో వరుస పరాజయాలతో ఫామ్ కోల్పోయిన రాజ్ తరుణ్ ప్రస్తుతం సినిమాలేమీ చేయడం లేదు. దాంతో మనోడ్ని ట్విట్టర్ లో ఆడుకోవడం మొదలెట్టారు కొందరు అల్లరి గ్యాంగ్. మామూలుగా అయితే.. ఈ తరహా ట్రోల్స్ కి హీరోలు సరిగా రెస్పాండ్ అవ్వరు. కానీ.. రాజ్ తరుణ్ మాత్రం ఆ ట్రోల్స్ ను కూడా తనదైన శైలిలో డీల్ చేస్తున్నాడు.

2

3

మొన్నామధ్య ఒక కుర్రాడు.. “ఖాళీ టైమ్ లో ఏం చేస్తుంటావ్ అన్నా?” అని ఇప్పుడు సినిమాల్లేవ్ కదా అని అర్ధం వచ్చేటట్లు అడగగా.. దానికి రాజ్ తరుణ్ చాలా సింపుల్ గా “నా ఇంట్లో 13 కుక్కలు ఉన్నాయి.. వాటితో ఆడుకుంటాను” అని సమాధానమిచ్చాడు. రాజ్ తరుణ్ సెన్సాఫ్ హ్యూమర్ బాగానే ఉంది కానీ.. మనోడు కుదిరినంత త్వరగా ఏదో ఒక ప్రొజెక్ట్ సెట్ చేసుకోకపోతే మాత్రం కెరీర్ చిక్కుల్లో పడట్లే. అయితే.. రాజ్ తరుణ్ ఒక కొత్త దర్శకుడితో సినిమా చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాడని సమాచారం.

5

6

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus