ప్రభాస్ ముందు చిరు ఉంచిన టార్గెట్ ఇదే !!

  • February 22, 2017 / 09:37 AM IST

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో కలక్షన్ల సునామీ సృష్టించిన సినిమా బాహుబలి. దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం అనేక రికార్డులను తిరగరాసింది. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఏరియాల్లో అత్యధిక వసూళ్లను రాబట్టింది. వాటిని అందుకోవడానికి అనేక చిత్రాలు ప్రయత్నించినప్పటికీ చేరుకోలేకపోయాయి. సంక్రాంతికి వచ్చిన మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ మూవీ ఖైదీ నంబర్ 150 అనేక చోట్ల బాహుబలి 1 రికార్డులను బద్దలు కొట్టింది. తక్కువ వసూలు వచ్చే ఉత్తరాంధ్ర లో చిరు సినిమా 13 కోట్లు రాబట్టింది. ఇక్కడ ప్రభాస్ చిత్రం 9 కోట్లు వసూలు చేసింది.

దీనిని అప్పట్లో అత్యధిక కలక్షన్స్ గా ట్రేడ్ వర్గాల వారు చెప్పారు. ఆ మార్క్ రీచ్ కావడం కుదరదని అన్నారు. వారి  అంచనాలను చిరు బద్దలు కొట్టారు. ప్రభాస్ కి కొత్త టార్గెట్ ని ఫిక్స్ చేశారు. ఏప్రిల్ 28 న థియేటర్లలోకి రానున్న బాహుబలి కంక్లూజన్ చిరు సాధించిన రికార్డ్ ని బద్దలు కొడుతుందో.. లేదో చూడాలి.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus