’30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ ఓటిటికి కూడా వర్కౌట్ కావడం లేదట..!

  • November 12, 2020 / 05:44 PM IST

స్టార్ యాంక‌ర్ ప్ర‌దీప్ తనదైన శైలిలో బుల్లితెర పై ప్రేక్షకులను అలరిస్తూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు. ఏమాత్రం అతి అనేది లేకుండా ప్రేక్షకులను అట్రాక్ట్ చేసే విధంగా ఇతని యాంకరింగ్ ఉంటుంది అనడంలో సందేహం లేదు. సినిమాల్లో కూడా చిన్న చిన్న పాత్రలు చేస్తూ అలరించిన ప్రదీప్… హీరోగా మారుతూ `30 రోజుల్లో ప్రేమించ‌డం ఎలా?’ అనే చిత్రం చేసాడు. ‌సుకుమార్ శిష్యుడు మున్నాఈ చిత్రం ద్వారా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు. ఎస్వీ బాబు నిర్మించిన ఈ చిత్రంలో అమృతా అయ్య‌ర్ హీరోయిన్.

నిజానికి మార్చిలోనే ఈ చిత్రాన్ని విడుద‌ల చెయ్యాలి అనుకున్నారు కానీ క‌రోనా కార‌ణంగా ఆగిపోయింది. `నీలి నీలి ఆకాశం..` అనే పాట యూట్యూబ్‌లో 200 మిలియ‌న్ కు పైనే వ్యూస్‌ నమోదుచేసింది.ఇక ‘జిఏ2 పిక్చర్స్’ మరియు ‘యూవీ క్రియేషన్స్’ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని రిలీజ్ చెయ్యడానికి ముందుకు రావడంతో.. కచ్చితంగా ఇది బ్లాక్ బస్టర్ సినిమానే అనే నమ్మకం అందరిలోనూ ఏర్పడింది.అందుకే ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. క‌రోనా ప్రభావం తగ్గిన తరువాత థియేటర్లలోనే ఈ చిత్రాన్ని విడుదల చెయ్యాలని నిర్మాతలు భావించారు. కానీ ఇప్పటి పరిస్థితి పూర్తి బిన్నంగా ఉందట.

ఏప్రిల్ టైములో ఓటిటి సంస్థల నుండీ ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ చిత్రానికి భారీ ఆఫర్లు వచ్చాయి. కానీ లైట్ తీసుకున్నారు. ఇప్పుడు థియేటర్లు తెరుచుకునే పరిస్థితి ఉన్నప్పటికీ జనాలు మాత్రం ఇంట్రెస్ట్ చూపించడం లేదు.అందుకే ఈ చిత్రాన్ని ఓటిటిలోనే విడుదల చెయ్యాలని నిర్మాతలు ప్రయత్నాలు మొదలుపెట్టారట. కానీ మొదట పలికినంత రేటు ఇప్పుడు పలకడం లేదని సమాచారం.కొద్దిరోజులు ప్రయత్నించి.. అప్పటికీ మంచి రేటు రాకపోతే అల్లు అరవింద్ గారి ‘ఆహా’ లో ఈ చిత్రాన్ని విడుదల చెయ్యాలని నిర్మాతలు భావిస్తున్నట్టు సమాచారం.

Most Recommended Video

ఆకాశం నీ హద్దు రా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 4’ లో ఎవరి పారితోషికం ఎంత.. ఎక్కువ ఎవరికి..?
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus