Ram Charan: ఆ పాత్రకు చరణ్ ఓకే చెప్పడం సాధ్యమేనా?

  • March 6, 2023 / 02:07 PM IST

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన రామ్ చరణ్ కు ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉండగా ఆర్ఆర్ఆర్ మూవీ సక్సెస్ తో రామ్ చరణ్ కు క్రేజ్ రెట్టింపు అయిందనే సంగతి తెలిసిందే. చరణ్ కెరీర్ పరంగా బిజీ కావడంతో పాటు మరిన్ని ఆఫర్లను సొంతం చేసుకుని విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ మనస్పూర్తిగా కోరుకుంటున్నారు ఆచార్య సినిమా ఫ్లాప్ రిజల్ట్ ను అందుకున్నా ఆ సినిమాకు చరణ్ ప్లస్ అయ్యారే తప్ప మైనస్ కాలేదు.

అయితే తాజాగా అల్లు అర్జున్ బాలీవుడ్ మూవీ ఆఫర్ ను సున్నితంగా రిజెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. షారుఖ్ ఖాన్ అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో 15 నిమిషాల నిడివి గల పాత్రలో బన్నీని నటింపజేయాలని ప్రయత్నాలు జరగగా బన్నీ మాత్రం సున్నితంగా ఆ పాత్రను రిజెక్ట్ చేయడం ద్వారా వార్తల్లో నిలిచారు. అయితే ప్రస్తుతం అదే రోల్ కోసం రామ్ చరణ్ ను మేకర్స్ సంప్రదించారని తెలుస్తోంది.

రామ్ చరణ్ ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తే చరణ్ వల్ల ఈ సినిమాకు మరింత ఎక్కువగా బిజినెస్ జరిగే ఛాన్స్ ఉంది. పఠాన్ మూవీ సక్సెస్ తో జోరుమీదున్న షారుఖ్ ఖాన్ తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా వరుస విజయాలను అందుకుంటానని భావిస్తున్నారు. బన్నీ సోలో హీరోగా మాత్రమే కెరీర్ ను కొనసాగించాలని భావిస్తున్న నేపథ్యంలో భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసినా గెస్ట్ రోల్స్ కు ఓకే చెప్పడం లేదు.

కొన్ని సందర్భాల్లో ఈ గెస్ట్ రోల్స్ కెరీర్ పరంగా ప్లస్ అయితే మరికొన్ని సందర్భాల్లో మైనస్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. రామ్ చరణ్ ఈ ఆఫర్ కు యస్ చెబుతారో నో చెబుతారో చూడాల్సి ఉంది. ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్స్ ను మాత్రమే నటింపజేయాలని అట్లీ భావిస్తున్నారని బోగట్టా. ఈ సినిమా విషయంలో చరణ్ ఏ విధంగా రియాక్ట్ అవుతారో మరికొన్ని రోజుల్లో స్పష్టత రానుంది.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus