ఫ్యామిలీ ఎంటర్ టైనర్లో ఎనర్జిటిక్ స్టార్ కన్ఫ్మర్

  • January 22, 2020 / 03:46 PM IST

వెంకటేష్, వరుణ్ తేజ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన “ఎఫ్ 2” తెలుగులో ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. వెంకటేష్, వరుణ్ లను 100 కోట్ల క్లబ్ జాయిన్ చేసిన సినిమా ఇది. అప్పటివరకూ వరుస పరాజయాలతో కొట్టుమిట్టాడుతున్న దిల్ రాజుకు సక్సెస్ బూస్ట్ ఇచ్చిన సినిమా అది. ఈ సినిమాను హిందీలో బోణీ కపూర్ రీమేక్ చేయనున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ సినిమాకి సీక్వెల్ గా “ఎఫ్ 3” తీస్తానని దిల్ రాజుతోపాటు అనిల్ రావిపూడి కూడా ఒకటికి రెండుసార్లు చెప్పడం తెలిసిందే.

అయితే.. తాజా సమాచారం ప్రకారం “ఎఫ్ 3″లో వెంకీ-వరుణ్ తోపాటు రవితేజ కూడా జాయిన్ అవుతున్నట్లు తెలుస్తోంది. “సరిలేరు నీకెవ్వరు” సక్సెస్ తర్వాత కొంత విరామం తీసుకొని “ఎఫ్ 3″ని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు అనిల్ రావిపూడి. దిల్ రాజు నిర్మించనున్న ఈ సీక్వెల్లో మొదటి పార్ట్ లో నటించిన తమన్నా, మెహరీన్ లు కూడా ఉండనున్నారు. మరి ఈ సినిమా సెట్స్ కు ఎప్పుడు వెళుతుంది అనేది మాత్రం దిల్ రాజు & టీం చెప్పాలి.

సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!
ఎంత మంచివాడవురా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus