Balayya Babu: ఆ హీరోలకు బాలయ్య షోకు ఆహ్వానం అందుతుందా?

  • September 18, 2022 / 07:09 PM IST

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన బాలకృష్ణకు ప్రేక్షకుల్లో ఊహించని రేంజ్ లో క్రేజ్ ఉంది. బాలయ్య గత సినిమా అఖండ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడంతో పాటు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. బాలయ్య ప్రస్తుతం గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి అధికారిక ప్రకటనతో పాటు ఈ సినిమా నుంచి మరో టీజర్ రిలీజ్ కానుందని తెలుస్తోంది.

బాలయ్య హోస్ట్ గా ఆహా ఓటీటీలో అన్ స్టాపబుల్ సీజన్2 త్వరలో మొదలుకానుంది. చిరంజీవి గెస్ట్ గా అన్ స్టాపబుల్ సీజన్2 తొలి ఎపిసోడ్ ప్రసారం కానుందని తెలుస్తోంది. అయితే నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ ఈ షోకు హాజరు కావాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే ఈ ముగ్గురు హీరోలు ఈ షోకు హాజరవుతారో లేదో క్లారిటీ రావాల్సి ఉంది. అన్ స్టాపబుల్ సీజన్ 1కు హాజరు కాని ప్రముఖ సెలబ్రిటీలు ఈ సీజన్ కు హాజరు కానున్నారని తెలుస్తోంది.

ఆహా ఓటీటీ ఊహించని స్థాయిలో సక్సెస్ సాధించడానికి బాలయ్య హోస్ట్ చేసిన ఈ షో కూడా ఒక కారణమని చెప్పవచ్చు. అన్ స్టాపబుల్ షో సీజన్2 కూడా ఊహించని స్థాయిలో సక్సెస్ అవుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. బాలయ్య ఈ షో కోసం రికార్డ్ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని కామెంట్లు వినిపిస్తోంది. అన్ స్టాపబుల్ సీజన్1 తో పోల్చి చూస్తే ఈ షోకు బాలయ్య రెట్టింపు స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని బోగట్టా.

అన్ స్టాపబుల్ సీజన్2 తో ఆడియన్స్ కు ఊహించని స్థాయిలో ఎంటర్టైన్మెంట్ అందేలా ఈ షో నిర్వాహకులు కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. బాలయ్య త్వరలో అన్ స్టాపబుల్ సీజన్2 షూటింగ్ లో పాల్గొననున్నారు. బాలయ్య అనిల్ రావిపూడి కాంబో మూవీ షూటింగ్ కూడా ఈ ఏడాదే మొదలు కానుందని సమాచారం. ఈ సినిమాతో బాలయ్య ఖాతాలో మరో సక్సెస్ చేరుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus