Waltair Veerayya: వాల్తేరు వీరయ్య మూవీ ఆ రికార్డ్ ను సులువుగా బ్రేక్ చేస్తుందా?

  • October 28, 2023 / 11:19 PM IST

cచిరంజీవి బాబీ కాంబినేషన్ లో తెరకెక్కిన వాల్తేరు వీరయ్య మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమా 200 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం గ్రాస్ కలెక్షన్లను సాధించింది. ఈ సినిమా ఇక్కడ ఓటీటీలో హిట్ గా నిలవడంతో పాటు బుల్లితెరపై కూడా మంచి రేటింగ్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమా తమిళ్ వెర్షన్ అక్టోబర్ నెల 29వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు ప్రసారం కానుంది.

విజయ్ ఛానల్ లో ఈ సినిమా ప్రసారం కానుండగా ఈ మూవీ గతంలో చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి క్రియేట్ చేసిన 15.44 టీఆర్పీ రేటింగ్ ను బ్రేక్ చేస్తుందో లేదో చూడాల్సి ఉంది. తమిళంలో ఈ స్థాయి రేటింగ్ ను సొంతం చేసుకోవడం సులువు కాదు. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించారు. మైత్రీ నిర్మాతలు ఈ సినిమాను నిర్మించడం గమనార్హం.

వాల్తేరు వీరయ్య (Waltair Veerayya) సక్సెస్ తర్వాత చిరంజీవి నటించిన భోళా శంకర్ మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేదు. చిరంజీవి రెమ్యునరేషన్ అంతకంతకూ పెరుగుతుండగా ఇతర భాషల్లో సైతం సక్సెస్ సాధించే దిశగా చిరంజీవి అడుగులు వేయాల్సి ఉంది. చిరంజీవి ప్రస్తుతం వశిష్ట సినిమాతో బిజీగా ఉన్నారు. 2024 సంవత్సరంలో చిరంజీవి సినిమాలేవీ రిలీజ్ కావని తెలుస్తోంది.

సినిమాల స్క్రిప్ట్ ఎంపికలో చిరంజీవి మరింత జాగ్రత్త వహించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. చిరంజీవి తర్వాత సినిమా కోసం చాలా కష్టపడుతున్నారని తెలుస్తోంది. ఈ సినిమా స్క్రిప్ట్ కు సంబంధించి వశిష్ట చాలా వర్క్ చేశారని తెలుస్తోంది. వశిష్ట ఈ సినిమా సక్సెస్ తో స్టార్ డైరెక్టర్ల జాబితాలో చేరడం గ్యారంటీ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. చిరు తర్వాత సినిమాలపై అంచనాలు పెరుగుతున్నాయి.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus