Writer Padmabhushan Collections: డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘రైటర్ పద్మభూషణ్’ ..!

  • February 27, 2023 / 04:48 PM IST

‘ఛాయ్ బిస్కెట్ ఫిలిమ్స్’ అండ్ ‘లహరి ఫిలిమ్స్’ బ్యానర్ల పై సుహాస్ హీరోగా టీనా శిల్ప రాజ్ రోహిణి, ఆశిష్ విద్యార్థి కీలక పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘రైటర్ పద్మభూషణ్’. షణ్ముఖ ప్రశాంత్ ఈ చిత్రానికి దర్శకుడు. ఫిబ్రవరి 3న ఎటువంటి అంచనాలు లేకుండా చాలా సైలెంట్ గా రిలీజ్ అయిన ఈ చిత్రం తొలి రోజు పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. సుహాస్ ప్రేక్షకుల్లో కొంత క్రేజ్ సంపాదించుకున్న నటుడు కావడంతో ఈవెనింగ్ షోలకు కొన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు పడ్డాయి.

ఓవర్సీస్ లో కూడా మంచి ఓపెనింగ్స్ ను రాబట్టుకుంది ఈ చిత్రం. దీంతో ఫైనల్ గా ఫస్ట్ వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించి ట్రేడ్ కు సైతం షాకిచ్చింది ఈ మూవీ వీక్ డేస్ లో కూడా బాగానే కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ స్టేటస్ ను దక్కించుకుంది. ఒకసారి క్లోజింగ్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 1.21 cr
సీడెడ్ 0.47 cr
ఆంధ్ర(టోటల్) 1.26 cr
ఏపీ + తెలంగాణ 2.94 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.12 cr
ఓవర్సీస్ 0.83 cr
వరల్డ్ వైడ్ టోటల్ 3.89 cr

‘రైటర్ పద్మభూషణ్’ చిత్రానికి రూ.1.75 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ మూవీ రూ.3.89 కోట్ల షేర్ ను రాబట్టి సూపర్ హిట్ గా నిలిచింది. బయ్యర్స్ కు ఈ మూవీ రూ.2.14 కోట్ల లాభాలను అందించి డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.ఓవర్సీస్ లో కూడా ఈ మూవీ పెద్ద హిట్ గా నిలిచింది.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus