చేతకాని పనులకు పోవద్దని చిరుకి అప్పుడే చెప్పాను.. కానీ వినలేదు : యండమూరి
November 19, 2020 / 08:35 PM IST
|Follow Us
యండమూరి వీరేంద్ర నాథ్ ఎంత గొప్ప రచయితో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. యువతను మంచి దారిలో పెట్టే విధంగా ఈయన రచన ఉంటుంది. ఇక యండమూరికి, మెగాస్టార్ చిరంజీవి కు మధ్య ఎంతో మంచి సాన్నిహిత్యం ఉన్న సంగతి తెలిసిందే. చిరంజీవి నటించిన.. ‘మంచు పల్లకి’, ‘అభిలాష’, ‘ఛాలెంజ్’, ‘రాక్షసుడు’, ‘దొంగ మొగుడు’ ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’…వంటి చిత్రాలకు రైటర్ గా పనిచేసారు యండమూరి. ‘స్టువర్టుపురం పోలీస్టేషన్’ చిత్రానికి యండమూరిని దర్శకుడిగా కూడా మార్చారు చిరు.
ఆ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా.. వీరి బంధం బ్రేక్ అవ్వలేదు. అయితే యండమూరికి సంబంధం లేని ‘మృగరాజు’ సినిమా కారణంగా చిరు, యండమూరి మధ్య మనస్పర్థలు వచ్చాయని అప్పట్లో ప్రచారం జరిగింది. తాజాగా ఈ విషయం పై స్పందించిన యండమూరి ఆ ప్రచారంలో నిజం లేదని తేల్చేసారు.’ ‘మృగరాజు’ సినిమా టైములో నేను నా కొడుకు పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నాను. అయితే ఆ టైములో నాకు 4లక్షలు అవసరం పడింది. దాంతో చిరంజీవి గారిని కలిసాను. ఆయన ‘మృగరాజు’ నిర్మాత అయిన నాగబాబుని కలవమన్నారు.
కథలో కొన్ని మార్పులకు సలహాలని అడిగి నాకు ఆయన 4లక్షలు ఇచ్చారు. కాబట్టి ఆ చిత్రంతో నన్ను చిరు దూరం పెట్టలేదు. అయితే ఆయన్ని నేను రాజకీయాల్లోకి వెళ్లొద్దు అని సూచించాను. ఆయన వ్యక్తిత్వానికి రాజకీయాలు సెట్ అవ్వవు అని ఆయనతో చెప్పాను. అదే విషయాన్ని నేను ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పడం చిరంజీవిగారికి నచ్చలేదు. అంతే.. అంతకు మించి మా మధ్య ఎటువంటి గొడవలు లేవు’ అంటూ చెప్పుకొచ్చారు యండమూరి.