సినీ పరిశ్రమలో మరో విషాదం.. స్టార్ డైరెక్టర్ భార్య మృతి
April 20, 2023 / 01:04 PM IST
|Follow Us
సినీ పరిశ్రమలో విషాదాల సంఖ్య పెరుగుతూనే ఉంది. కమెడియన్ అల్లు రమేశ్ మరణించి మూడు రోజులు కూడా కాకుండానే ఈరోజు మరో సింగర్ మరణించిన సంగతి తెలిసిందే. నిండా పాతికేళ్ళు కూడా లేని కొరియన్ పాప్ సింగర్ అలాగే నటుడు అయిన మూన్ బిన్ అతని నివాసంలో సూసైడ్ చేసుకుని చనిపోయాడు. ఇలాంటి విషాద వార్త వచ్చి కనీసం ఒక్కరోజైనా కాకుండానే మరో విషాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
బాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్, నిర్మాత అయిన యశ్ చోప్రా సతీమణి .. నిర్మాత, సింగర్ పమేలా చోప్రా ఈరోజు కన్నుమూశారు. ఆమె వయసు 85 ఏళ్లు కావడం గమనార్హం.ఈ విషయాన్ని బాలీవుడ్ రచయిత జావెద్ అక్తర్ తన ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు.అతను ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. ‘పమేలా చోప్రా గొప్ప మహిళ, చాలా తెలివైంది, విద్యావేత్త, ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ ఉండేది’ అంటూ అతను పేర్కొన్నాడు. ఇక పమేలా కుమారుడు ఆదిత్య చోప్రా ప్రస్తుతం ఫిల్మ్‌మేకర్‌గా ఉన్న సంగతి తెలిసిందే.
మరో కుమారుడు ఉదయ్ చోప్రా యాక్టర్. నటి రాణీ ముఖర్జీని ఆదిత్య చోప్రా పెళ్లి చేసుకోవడం జరిగింది. పమేలా చోప్రా .. సింగర్, రైటర్, డ్రెస్ డిజైనర్‌గా చేశారు. ‘యశ్ రాజ్ ఫిల్మ్స్‌లో’ చాలా సినిమాలకి ఆమె కో ప్రొడ్యూసర్ గా వ్యవహరించడం జరిగింది. ఇటీవల నెట్‌ఫ్లిక్స్ లో రూపొందించిన ఓ డాక్యుమెంటరీలో ఆమె కనిపించింది. యశ్ చోప్రా 2012లో మరణించిన సంగతి తెలిసిందే. పమేలా, యశ్ ల పెళ్లి 1970లో జరిగింది.