Yash: ‘కేజీయఫ్‌’ స్టార్‌ యశ్‌ 14 తర్వాత చేసే పని ఇదేనట!

  • April 8, 2022 / 07:51 PM IST

ప్రపంచం మొత్తం ‘కేజీయఫ్‌ 2’ సినిమా చూడాలని అనుకుంటోంది. మరి ఆ సినిమా హీరో యశ్‌ ఏ సినిమాలు చూడాలనుకుంటున్నారు? ఈ ప్రశ్న బాగుంది కదా. చాలామంది ఆసక్తికరంగా అనిపిస్తున్న ఈ ప్రశ్న ఇటీవల యశ్‌ని అడిగింది మీడియా. దానికి ఆయన చెప్పిన సమాధానం ఇప్పుడు వైరల్‌గా మారింది. ఆ సినిమాలేంటో తెలుసా? మీరు ఇటీవల చూసిన సినిమా ఒకటి అందులో కచ్చితంగా ఉంటుంది. ఇంతకీ ఏంటి ఆ సినిమాలో తెలుసుకుందాం.

సంచలనాలు సృష్టించిన ‘కేజీయఫ్‌’కి కొనసాగింపుగా ‘కేజీయఫ్‌ 2’ సినిమాను తీసుకొస్తున్నారు. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఈ నెల 14న సినిమాను విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో యశ్‌ దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు. దీంతో ఇతర సినిమాలను చూసే అవకాశం కలగడం లేదట. అవకాశం రాగానే చూసే తొలి సినిమాల్లో ‘ఆర్‌ఆర్ఆర్‌’, ‘కాశ్మీర్‌ ఫైల్స్‌’ ఉంటాయి అని చెప్పాడు యశ్‌. అంతేకాదు ఆ రెండు సినిమాలను థియేటర్లలోనే వీక్షిస్తానని చెప్పుకొచ్చాడు యశ్‌.

‘ఆర్ఆర్ఆర్‌’ సినిమా దేశంలో సృష్టిస్తున్న ప్రభంజనం గురించి తెలిసిందే. రూ. వెయ్యి కోట్ల మార్కుకు చాలా దగ్గర్లో ఉంది. రూ. 960 కోట్లకుపైగా వసూలు చేసి, రూ. వెయ్యి కోట్ల మార్క్‌ వైపు దూసుకుపోతోంది. మరోవైపు ‘కాశ్మీర్‌ ఫైల్స్‌’ కూడా మంచి విజయాన్ని అందుకుంది. ‘ఆర్‌ఆర్ఆర్‌’ కంటే ముందే విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు రూ. 200 కోట్లకుపైగా వసూలు చేసింది. ‘కేజీయఫ్‌ 2’ విషయానికొస్తే… ట్రైలర్‌ను చూసినవాళ్లు తొలిభాగం ఛాప్టర్‌-1కు మించి ఛాప్టర్‌- 2 రూపొందినట్టు ట్రైలర్‌ చూస్తుంటే అర్థమవుతోంది.

ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్‌ నిర్మించింది. యశ్‌ సరసన శ్రీనిధి శెట్టి.. యశ్‌ సరసన సందడి చేయనుంది. ‘కేజీయఫ్‌ 1’ అనూహ్య విజయం అందుకోవడంతో అన్ని చిత్ర పరిశ్రమల్లోనూ ‘కేజీయఫ్‌-2’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ పాన్‌ ఇండియా చిత్రం ఏప్రిల్‌ 14న విడుదల కానుంది.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus