పెళ్లి రోజు సందర్భంగా బ్యూటిఫుల్ పిక్స్ షేర్ చేసిన ‘రాకింగ్ స్టార్’ యష్ భార్య రాధిక పండిట్..!
December 10, 2022 / 01:50 PM IST
|Follow Us
‘రాకింగ్ స్టార్’ యష్.. ‘కేజీఎఫ్’ తో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు.. అప్పటికి కేవలం కన్నడ ఇండస్ట్రీకి మాత్రమే తెలిసిన తన పేరుని ప్రపంచమంతా పలికేలా.. మారు మోగేలా చేశాడు.. ఓవర్ నైట్ స్టార్ అనడం కంటే ఓవర్ నైట్ పాన్ ఇండియా స్టార్ అనొచ్చు.. మరోసారి ‘కేజీఎఫ్ 2’ తో వరల్డ్ బాక్సాఫీస్‌ని షేక్ చేశాడు. తన వంతుగా కన్నడ పరిశ్రమకి మంచి గుర్తింపు తెచ్చాడు.. యష్, నటి రాధిక పండిట్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు..
వీరికి ఓ పాప, బాబు ఉన్నారు.. ‘మొగ్గిన మనసు’ సినిమాలో ఫస్ట్ టైం కలిసి నటించారు. ఇందులో రాధిక మెయిన్ రోల్ చేస్తే.. యష్ సపోర్టింగ్ క్యారెక్టర్లో కనిపించాడు.. తర్వాత కూడా కలిసి పలు సినిమాల్లో నటించారు.. రాధిక కన్నడలో అప్పటికే పాపులర్ యాక్ట్రెస్.. అలా ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో.. కొద్ది రోజుల తర్వాత పెద్దవాళ్లని ఒప్పించి ఒక్కటయ్యారు..యష్, రాధికల పెళ్లి 9 డిసెంబర్ 2016లో జరిగింది.
గురువారం (డిసెంబర్ 9)న ఈ జంట తమ 6వ వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకున్నారు.. ఈ సందర్భంగా ఫ్యాన్స్, నెటిజన్లు, కన్నడ చిత్ర పరిశ్రమ వర్గాల వారంతా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.. తమ వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని.. భర్తతో కలిసి ఉన్న కొన్ని బ్యూటిఫుల్ పిక్స్ షేర్ చేస్తూ.. ఓ ఎమోషనల్ పోస్ట్ చేశారామె..‘‘మనం సినిమా కావొచ్చు, మనం హ్యాపీగా ఉండొచ్చు.. మనం కోపంగా ఉండొచ్చు.. కానీ మనం అనేది నిజం..
ఈ ఆరేళ్ల నా వైవాహిక జీవితాన్ని ఇంత అద్భుతంగా మార్చినందకు చాలా థ్యాంక్స్.. హ్యాపీ యానివర్సరీ.. లవ్ యూ’’ అంటూ రాధిక చేసిన పోస్ట్, పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.. కాగా ‘కేజీఎఫ్’ తర్వాత కొత్త సినిమా అనౌన్స్ చేయడానికి యష్ బాగానే టైం తీసుకున్నాడు.. పాన్ ఇండియా క్రేజ్ వచ్చింది కాబట్టి.. ఆ రేంజ్ స్టోరీస్ సెలెక్ట్ చేసుకోవాలి.. అందుకే కాస్త గ్యాప్ వచ్చిందని శాండల్ వుడ్ సమాచారం..