Yashoda Collections: బ్రేక్ ఈవెన్ పూర్తి చేసి హిట్ లిస్ట్ లోకి ఎంట్రీ ఇచ్చిన ‘యశోద’
November 21, 2022 / 05:02 PM IST
|Follow Us
సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘యశోద’. ‘శ్రీదేవి మూవీస్’ బ్యానర్ పై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రాన్ని హరి, హరీష్ డైరెక్ట్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ మూవీ నవంబర్ 11న రిలీజ్ అయ్యింది.సరోగసి పద్ధతి నేపథ్యంలో సాగే కథాంశంతో..సస్పెన్స్ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఈ మూవీ తెరకెక్కింది. అది మాత్రమే కాకుండా సినిమాలో ఇంకా సర్ప్రైజ్ లు ఉన్నాయి.
మొదటి రోజు పాజిటివ్ టాక్ ను సంపాదించుకున్న ఈ మూవీ వీకెండ్ ను బాగానే క్యాష్ చేసుకుంది.అయితే వీక్ డేస్ లో డౌన్ అయ్యింది.కృష్ణ గారి మరణం వల్ల ఈ మూవీ కలెక్షన్స్ తగ్గాయి.అయితే రెండో వీకెండ్ కు మళ్ళీ కోలుకుంది. నిన్నటితో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుని హిట్ లిస్ట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఒకసారి ‘యశోద’ ఒకసారి 10 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :
నైజాం
3.88 cr
సీడెడ్
0.73 cr
ఉత్తరాంధ్ర
1.03 cr
ఈస్ట్
0.47 cr
వెస్ట్
0.29 cr
గుంటూరు
0.49 cr
కృష్ణా
0.52 cr
నెల్లూరు
0.24 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
7.65 cr
తమిళనాడు
1.11 cr
హిందీ
0.55 cr
ఓవర్సీస్
2.65 cr
రెస్ట్
0.59 cr
టోటల్ వరల్డ్ వైడ్
12.55 cr (షేర్)
‘యశోద’ చిత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.11.5 కోట్లుగా ఉందని ట్రేడ్ పండితుల సమాచారం. 10 రోజులు పూర్తయ్యేసరికి ఈ మూవీ రూ.12.55 కోట్ల షేర్ ను రాబట్టింది. 10 రోజుల్లో బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ ఓవరాల్ గా బయ్యర్స్ కు రూ.1.05 కోట్ల లాభాలను అందించి హిట్ లిస్ట్ లోకి ఎంట్రీ ఇచ్చింది.