Yashoda Movie: సామ్ నాన్ స్టాప్ గా దూసుకుపోతుందిగా!
November 22, 2022 / 04:00 PM IST
|Follow Us
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది సమంత. రీసెంట్ గా ఈ బ్యూటీ నటించిన ‘యశోద’ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో హిట్ కొట్టేద్దామని భావించింది సమంత. ఆ రేంజ్ లో వర్కవుట్ కాకపోయినా.. టాలీవుడ్ లో మాత్రం ఈ సినిమా దూసుకుపోతుంది. విడుదలైన రెండు వారాలకు గాను ఈ సినిమా అన్ని భాషల్లో కలుపుకొని రూ.33 కోట్ల గ్రాస్ ను రాబట్టింది.
అంటే నిర్మాతలకు దాదాపు రూ.18 కోట్ల షేర్ వస్తుందన్నమాట. ఆ లెక్కన అన్ని ఏరియాల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయిపోయినట్లే. ఈ హిట్టుతో సమంత స్టేటస్ అండ్ స్టార్ డమ్ ఏ రేంజ్ ఓ ఉందనేది మరోసారి ప్రూవ్ అయింది. నిజం చెప్పాలంటే.. గ్లామర్ టచ్ లేని ఓ సోలో హీరోయిన్ సినిమా ఇంతవరకు రావడమంటే మామూలు విషయం కాదు. సమంత సింగిల్ హ్యాండ్ తో సినిమాకి రూ.33 కోట్ల గ్రాస్ తీసుకురాగలిగింది. కంటెంట్ పవర్ ఎంత ఉన్నా..
తన రేంజ్ మాత్రం విపరీతంగా ఉందని నిరూపించుకోగలిగింది సమంత. పైగా ఈ సినిమాకి సరైన ప్రమోషన్స్ కూడా లేవు. సమంత అనారోగ్యం కారణంగా కేవలం ఒక్క ఇంటర్వ్యూ మాత్రమే ఇవ్వగలిగింది. అదే ఆమె గనుక యాక్టివ్ గా సినిమాను ప్రమోట్ చేసి ఉంటే కలెక్షన్స్ మరో రేంజ్ లో ఉండేవి. ప్రస్తుతం సమంత ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటుంది.
ఒక్కసారి ఆమె సెట్ అయితే తిరిగి షూటింగ్స్ మొదలుపెట్టాలని చూస్తుంది. ప్రస్తుతం ఆమె చేతిలో ‘ఖుషి’ అనే సినిమా ఉంది. ఈ సినిమాను ముందుగా పూర్తి చేయాలి. ఆ తరువాత కొన్ని బాలీవుడ్ ప్రాజెక్ట్స్ చేయాలనుకుంటుంది సమంత. ఇక వచ్చే ఏడాదిలో ఆమె నటించిన ‘శాకుంతలం’ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.