Radha: కూతురికి కోట్లు విలువచేసే కట్న కానుకలు ఇచ్చిన రాధా?
November 27, 2023 / 07:46 PM IST
|Follow Us
సీనియర్ సినీనటి రాధా తాజాగా తన కుమార్తె కార్తికకు ఎంతో ఘనంగా వివాహం చేసిన సంగతి మనకు తెలిసిందే. ఈమె తన పెద్ద కుమార్తె కార్తీకను హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. అయితే కార్తిక ఇండస్ట్రీలో హీరోయిన్గా ఏమాత్రం సక్సెస్ కాలేకపోయారు. ఇలా ఇండస్ట్రీలో సక్సెస్ కాకపోవడంతో తిరిగి ఈమె తమ వ్యాపారాలను చూసుకుంటూ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరింప చేశారు. ఇకపోతే తాజాగా కార్తీకకు మరొక వ్యాపారవేత అయినటువంటి రోహిత్ మీనన్ అనే వ్యక్తికి ఇచ్చి ఎంతో అంగరంగ వైభవంగా కేరళలోని ఒక రిసార్ట్ లో ఈమె వివాహం జరిపించారు.
వీరి వివాహ వేడుక ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు పలువురు సినీ రాజకీయ సెలబ్రిటీలు హాజరయ్యారు. ఇకపోతే ఈ వివాహ వేడుకల్లో భాగంగా కార్తీక కంటే ఆమె వేసుకున్న నగలపైనే అందరి దృష్టిపడిందని చెప్పాలి. ఒంటినిండా పెద్దపెద్ద నగలు వేసుకొని ఈమె అందరి దృష్టిని ఆకర్షించారు. ఇలా ఈ పెళ్లి వేడుకలలో కార్తీక రాధ చాలా స్పెషల్ అట్రాక్షన్ గా ఉండడంతో వీరి ఆస్తిపాస్తులు గురించి కూడా అందరికీ ఎన్నో సందేహాలు వచ్చాయి.
అయితే తాజాగా రాదా (Radha) తన పెద్ద కుమార్తె పెళ్లిలో భాగంగా తన కుమార్తె కోసం ఎలాంటి కట్న కానుకలు ఇచ్చారనే విషయానికి సంబంధించి ఒక వార్త వైరల్ గా మారింది. కార్తిక పెళ్లిలో భాగంగా రాధా తన పెద్ద కుమార్తె కోసం ఏకంగా 35 కోట్ల రూపాయల విలువ చేసే బంగారు వజ్రభరణాలను కానుకగా ఇచ్చారని తెలుస్తోంది.
వీటితోపాటు దుబాయిలో కార్తిక మెయింటైన్ చేస్తున్నటువంటి రెస్టారెంట్ కూడా తన పేరు మీదనే రాశారట. ఇక అల్లుడి కోసం కోట్ల విలువచేసే ఖరీదైన కారును కూడా కానుకగా ఇచ్చారు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఏది ఏమైనా కూతురి కోసం భారీ స్థాయిలోనే రాధ కట్న కానుకలు సమర్పించారని తెలుస్తుంది.