Ram Charan: కూతురు పుట్టగానే రామ్ చరణ్ రియాక్షన్ ఏంటో తెలుసా?

  • June 21, 2023 / 06:49 PM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దంపతులు పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. మంగళవారం ఉదయం ఉపాసన అపోలో హాస్పిటల్లో ఆడబిడ్డకు జన్మనిచ్చారు. అయితే సోమవారం సాయంత్రం మెగా ఫ్యామిలీ మొత్తం అపోలో హాస్పిటల్ కి వెళ్లిన విషయం మనకు తెలిసిందే. అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ విధంగా ఉపాసనకు డెలివరీ జరుగుతుండగా పుట్టబోయే బిడ్డ కోసం మెగా కుటుంబ సభ్యులందరూ చాలా ఆతృతగా ఎదురు చూశారు.

ఇక ఉపాసనకు డాక్టర్లు డెలివరీ చేస్తున్న సమయంలో సురేఖ ప్రత్యేకంగా హనుమాన్ చాలీసా చదువుతూ తన కోడలు తనకు పుట్టబోయే బిడ్డ ఇద్దరు కూడా క్షేమంగా ఉండాలని ఈమె హనుమాన్ చాలీసా చదివారట.అదే సమయంలోనే రామ్ చరణ్ తో పాటు ఇతర కుటుంబ సభ్యులు కూడా పుట్టబోయే బిడ్డ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూశారు అయితే డెలివరీ అయిన తర్వాత డాక్టర్లు ముందుగా తన బిడ్డను తీసుకువచ్చి రామ్ చరణ్ చేతులలో పెట్టబోయారట.

రామ్ చరణ్ మాత్రం తన బిడ్డను చూడగానే తనని చేతులలోకి తీసుకోకుండా ముందుగా తన తండ్రి చేతులలోకి పెట్టమని చెప్పారట.ఇలా మెగా వారసురాలిని తన చేతులలోకి తీసుకున్నటువంటి చిరంజీవి దంపతులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారని వారి కళ్ళల్లో ఈ సంతోషం చూడటం కోసమే రామ్ చరణ్ తన బిడ్డను ముందుగా చిరంజీవి దంపతుల చేతులలో పెట్టారని తెలుస్తోంది.

అయితే రామ్ చరణ్ బిడ్డను ఎప్పుడెప్పుడు తమ చేతులలోకి ఎత్తుకుంటామా అని చిరంజీవి ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ విషయాన్ని ఈయన స్వయంగా తెలియజేశారు.అయితే ఆ క్షణం రావడంతో చిరంజీవి దంపతులు తమ మనవరాలిని చూసి ఎంతో సంతోషం వ్యక్తం చేశారని తెలుస్తోంది.అద్భుతమైన ఘడియలలో తమకు ఇష్టమైన మంగళవారం రోజున తమకు తమ మనవరాలు పుట్టడం ఎంతో అపురూపమంటూ చిరంజీవి కూడా సంతోషం వ్యక్తం చేశారు.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus