#SSMB28: త్రివిక్రమ్ మహేష్ మూవీకి నో చెప్పిన హీరోయిన్.. కానీ?

  • July 13, 2022 / 06:32 PM IST

మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ ఆగష్టు నెల నుంచి మొదలుకానుందనే సంగతి తెలిసిందే. 2023 సంవత్సరం సమ్మర్ కానుకగా ఈ సినిమా విడుదల కానుండగా ఈ సినిమా షూటింగ్ వేగంగా పూర్తి చేయాలని త్రివిక్రమ్ శ్రీనివాస్ భావిస్తున్నారు. ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తుండగా సెకండ్ హీరోయిన్ గా శ్రీలీల నటిస్తున్నారని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. అయితే తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం శ్రీలీల ఈ సినిమాను రిజెక్ట్ చేశారు.

శ్రీలీల ఈ సినిమాకు నో చెప్పడానికి ముఖ్యమైన కారణం ఉందని తెలుస్తోంది. సాధారణంగా మహేష్ బాబు సినిమాలో నటించడానికి ఏ హీరోయిన్ నో చెప్పరనే సంగతి తెలిసిందే. అయితే మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీలో సెకండ్ హీరోయిన్ రోల్ కావడంతో శ్రీలీల ఈ సినిమాకు సున్నితంగా నో చెప్పారని తెలుస్తోంది. శ్రీలీల త్రివిక్రమ్ మహేష్ కాంబో మూవీ ఆఫర్ ను రిజెక్ట్ చేసిన నేపథ్యంలో ఆ పాత్రకు ఏ హీరోయిన్ ఓకే చెబుతారో చూడాల్సి ఉంది.

త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ మధ్య కాలంలో తన డైరెక్షన్ లో తెరకెక్కిన ప్రతి సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక్కో సినిమాకు 30 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. త్రివిక్రమ్ మహేష్ కాంబో మూవీపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.

మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో మూడో సినిమాగా ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం. అతడు, ఖలేజా సినిమాల తర్వాత మహేష్ త్రివిక్రమ్ కాంబోలో సినిమా కావడంతో ఇండస్ట్రీ వర్గాలు సైతం ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఈ సినిమా పూర్తైన తర్వాతే మహేష్ బాబు రాజమౌళి కాంబో మూవీ షూట్ మొదలుకానుందని సమాచారం అందుతోంది.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus