కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ వల్ల 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు ఓపెన్ అయినా ప్రేక్షకులు థియేటర్లలో సినిమాలు చూసే పరిస్థితులు కనిపించడం లేదు. గత కొన్ని నెలలుగా షూటింగ్ లు ఆగిపోయిన నేపథ్యంలో నిర్మాతలకు వడ్డీలు భారంగా మారాయి. అయితే ప్రేక్షకుల్లో క్రేజ్ ఉన్న హీరోలు, హీరోయిన్లు మాత్రం రెమ్యునరేషన్ విషయంలో అస్సలు తగ్గమని చెబుతుండటం గమనార్హం. హిట్లు ఉన్న హీరోయిన్లు డిమాండ్ చేయడంలో తప్పు లేకపోయినా హిట్లు లేని హీరోయిన్లు సైతం భారీ మొత్తంలో డిమాండ్ చేస్తుండటం గమనార్హం.
కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమాతో నటిగా కెరీర్ ను మొదలుపెట్టిన మెహరీన్ సినీ కెరీర్ లో మహానుభావుడు, రాజా ది గ్రేట్, ఎఫ్2 మినహా హిట్లు లేవు. ఈ మూడు సినిమాలలో మెహరీన్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడం గమనార్హం. ప్రస్తుతం ఎఫ్3 సినిమాలో నటిస్తున్న మెహరీన్ కు మారుతి దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కుతున్న ఒక చిన్న సినిమాలో హీరోయిన్ గా నటించే ఆఫర్ వచ్చింది. ఈ సినిమా కోసం మెహరీన్ ఏకంగా 50 లక్షల రూపాయలు డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. చేతిలో పెద్దగా సినిమాలు లేని మెహరీన్ యాభై లక్షల కంటే తగ్గనని దర్శకనిర్మాతలకు చెబుతుండటం గమనార్హం.
మరోవైపు కరోనా సెకండ్ వేవ్ వల్ల ఈ హీరోయిన్ పెళ్లి వాయిదా పడింది. హీరోయిన్ రాశీఖన్నా కూడా రెమ్యునరేషన్ ను భారీగా పెంచేశారని సమాచారం. తెలుగుతో పాటు ఇతర భాషల్లో సినిమా ఆఫర్లతో బిజీగా ఉన్న రాశీఖన్నా ప్రస్తుతం ఒక్కో సినిమాకు కోటి రూపాయలు తీసుకుంటున్నారని తెలుస్తోంది.